భువనేశ్వర్: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌‌కు రూ, 50 కోట్లు చెల్లించాలంటూ ఛత్తీస్‌ఘడ్  ఖైదీ బెదిరింపు లేఖ రాశాడు.  ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. 

ఛత్తీస్‌ఘడ్‌లోని  జాంజ్‌గిరి-చంపా జిల్లాకు చెందిన పుష్పేంద్రనాథ్ చౌహాన్ అనే వ్యక్తి దోపీడీ, హత్య కేసులో అరెస్టయ్యాడు.  2009 నుండి జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు.

అయితే జైలు నుండే  తనకు రూ. 50 కోట్లు ఇవ్వాలని  ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు లేఖ రాశాడు. ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.  ఈ లేఖపై విచారణ చేపడుతున్నట్టు బిలాస్‌పూర్ ఎస్పీ ఆరిఫ్ తెలిపారు. ఈ ఏడాది ఆగష్టు 25వ తేదీన  ఈ లేఖ పోలీసులకు అందింది. 

ఈ లేఖను జైలు నుండి చౌహాన్ అనే ఖైదీ రాసినట్టు  గుర్తించారు.  ఈ విషయమై విచారణ జరిపారు.  చౌహాన్  తాను వార్తల్లో వ్యక్తిగా నిలిచేందుకు గాను  ఈ పనిచేశాడని భావిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. అతని మానసిక స్థితి కూడ సరిగా లేదని గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.

. బిలాస్‌పూర్‌ అదనపు ఎస్పీ నీరజ్‌ చంద్రకర్‌ ఆదివారం నిందితుడిని విచారించారు. గతంలోనూ ఓ కలెక్టర్‌కు ఈ తరహా లేఖను చౌహాన్  పంపినట్లు పోలీసులు గుర్తించారు.