నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

Friday 7th October Telugu News Live

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

9:53 PM IST

కాణిపాకం ఇన్‌ఛార్జ్ ఈవోపై వేటు

ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో పంచామృతాభిషేకం ధర పెంచుతున్నట్లు వార్తలు రావడంపై ట్రస్ట్ బోర్డ్ స్పందించింది. ధరలను పెంచడం లేదని.. సామాన్య భక్తులకు అందబాటులోనే ధరలు వుంటాయని తెలిపింది. అయితే ఇన్‌ఛార్జ్ ఈవో సురేష్ బాబుపై దేవాదాయ శాఖ బదిలీ వేటు వేసింది

8:48 PM IST

కాశ్మీర్‌లో అగ్నిపథ్‌కు అద్భుత స్పందన

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి యువత నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. తాజాగా జమ్మూకాశ్మీర్‌లో చేపట్టిన ర్యాలీకి తొలిరోజే వందలాది మంది యువత తరలివచ్చారు. జమ్మూలోని జోరవార్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. అక్టోబర్ 22 వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. 

8:08 PM IST

హైదరాబాద్‌లో ఈడీ సోదాలు

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, కూకట్‌పల్లిలో సోదాలు నిర్వహించారు. అభిషేక్ బోయిన్‌పల్లి పెట్టుబడులపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించిన మరిన్ని తెలియాల్సి వుంది. 

7:16 PM IST

ఓలా, ఉబెర్‌లకు కర్ణాటక సర్కార్ షాక్

క్యాబ్ సర్వీసులపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఓలా, ఉబెర్, ర్యాపిడో కంపెనీలకు చెందిన ఆటో సర్వీసులను నిలుపుదల చేయాలని ఆదేశించింది. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మూడు రోజుల పాటు ఈ సేవలను నిలుపుదల చేయాలని కర్ణాటక సర్కార్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. 

6:25 PM IST

త్వరలోనే డిజిటల్ రూపాయి విడుదల

దేశంలో త్వరలోనే డిజిటల్ రూపాయిని విడుదల చేస్తామని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ విధానంలో భాగంగా ఆర్బీఐ ఈ ప్రకటన చేసింది. సీబీడీసీ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇతర డిజిటల్ కరెన్సీ లాగే డిజిటల్ రూపాయితో లావాదేవీలు జరపవచ్చని ఆర్‌బీఐ తెలిపింది. 
 
5:58 PM IST

హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో మార్పులు

హైదరాబాద్ మెట్రో సర్వీసుల వేళలను అధికారులు పెంచారు. దీని ప్రకారం రాత్రి 11 గంటలకు ఆఖరి మెట్రో సర్వీసును నడుపుతామని తెలిపారు. కొత్త సమయాలు ఈ నెల 10 నుంచి అమల్లోకి తీసుకొస్తామని హైదరాబాద్ మెట్రో వెల్లడించింది

4:39 PM IST

మునుగోడు ఉపఎన్నిక ... తొలిరోజు రెండు నామినేషన్లు దాఖలు

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక హాట్ టాపిక్. ఇవాళే ఈ ఉపఎన్నికకు నోటిఫికేషన్ వెలువడి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమయ్యింది. మొదటిరోజు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రజా ఏక్తా పార్టీ నుండి నాగరాజు, స్వతంత్ర అభ్యర్థిగా వెంకట్ రెడ్డి నామినేషన్ వేసారు. 

4:00 PM IST

స్వల్ప నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 30 పాయింట్లు నష్టపోయి 58,191 వద్ద, నిప్టీ 17 పాయింట్లు నష్టపోయి 17,314 వద్ద స్థిరపడ్డాయి.  

3:14 PM IST

నోబెల్ శాంతి బహుమతి 2022 ప్రకటన...

ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి బెలారస్ కు చెందిన మానవ హక్కుల కార్యకర్త అలెస్ బైలియాట్ కు దక్కింది. ఆయనతో పాటు రష్యా, ఉక్రెయిన్ దేశాలకు చెందిన మానవ హక్కుల సంస్థలు 'మెమోరియల్', 'సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్' కు శాంతి బహుమతి దక్కింది. 

1:30 PM IST

మునుగోడు ఉపఎన్నిక... టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ఖరారు

మునుగోడు ఉపఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైన నేపథ్యంలో టీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఖరారు చేసారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని టీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. 

11:38 AM IST

నేషనల్ హెరాల్డ్ కేసు... ఈడీ విచారణకు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డికే

నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో నోటీసులు అందుకున్న కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివకుమార్ ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు. డిల్లీలోని ఈడి కార్యాలయంలో శివకుమార్ విచారణ కొనసాగుతోంది. 
 
10:33 AM IST

గుడ్ న్యూస్.. భారత్ లో 30వేలకు చేరిన కరోనా యాక్టివ్ కేసులు

భారతదేశంలో కరోనా కేసులు రోజురోజుకు మరింత తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం 30,362 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో కేవలం 1997 కొత్తకేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదయిన కరోనా కేసులు 4,46,06,460 కు చేరితే మరణాలు 5,28,754 కు చేరాయి. 

9:47 AM IST

డిల్లీ లిక్కర్ స్కామ్... హైదరాబాద్ లో ఈడీ సోదాలు

ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో మరోసారి ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీతో పాటు పంజాబ్, హైదరాబాద్ లలో సుమారు 35 ప్రదేశాల్లో సోదాలు సాగుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే సోదాలు చేపట్టినట్లు ఈడీ కేంద్ర కార్యాలయ వర్గాల వెల్లడించాయి, 

9:44 AM IST

ముంబై ఎయిర్ పోర్టులోరూ.120 కోట్ల డ్రగ్స్ పట్టివేత

ముంబై విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. పక్కా సమాచారంతో నార్కోటిక్ బ్యూరో అధికారులు విమానాశ్రయ సిబ్బంది సహకారంతో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రూ.120 కోట్ల విలువైన 50 కిలోల మెపిడ్రిన్ పట్టుబడింది. దీన్ని తరలిస్తున్న ఎయిరిండియా మాజీ పైలట్ తో పాటు మరొకరిని అరెస్ట్ చేసారు. 
 
9:53 PM IST:

ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో పంచామృతాభిషేకం ధర పెంచుతున్నట్లు వార్తలు రావడంపై ట్రస్ట్ బోర్డ్ స్పందించింది. ధరలను పెంచడం లేదని.. సామాన్య భక్తులకు అందబాటులోనే ధరలు వుంటాయని తెలిపింది. అయితే ఇన్‌ఛార్జ్ ఈవో సురేష్ బాబుపై దేవాదాయ శాఖ బదిలీ వేటు వేసింది

8:48 PM IST:

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి యువత నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. తాజాగా జమ్మూకాశ్మీర్‌లో చేపట్టిన ర్యాలీకి తొలిరోజే వందలాది మంది యువత తరలివచ్చారు. జమ్మూలోని జోరవార్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. అక్టోబర్ 22 వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. 

8:08 PM IST:

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, కూకట్‌పల్లిలో సోదాలు నిర్వహించారు. అభిషేక్ బోయిన్‌పల్లి పెట్టుబడులపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించిన మరిన్ని తెలియాల్సి వుంది. 

7:16 PM IST:

క్యాబ్ సర్వీసులపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఓలా, ఉబెర్, ర్యాపిడో కంపెనీలకు చెందిన ఆటో సర్వీసులను నిలుపుదల చేయాలని ఆదేశించింది. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మూడు రోజుల పాటు ఈ సేవలను నిలుపుదల చేయాలని కర్ణాటక సర్కార్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. 

6:25 PM IST:

దేశంలో త్వరలోనే డిజిటల్ రూపాయిని విడుదల చేస్తామని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ విధానంలో భాగంగా ఆర్బీఐ ఈ ప్రకటన చేసింది. సీబీడీసీ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇతర డిజిటల్ కరెన్సీ లాగే డిజిటల్ రూపాయితో లావాదేవీలు జరపవచ్చని ఆర్‌బీఐ తెలిపింది. 
 
5:58 PM IST:

హైదరాబాద్ మెట్రో సర్వీసుల వేళలను అధికారులు పెంచారు. దీని ప్రకారం రాత్రి 11 గంటలకు ఆఖరి మెట్రో సర్వీసును నడుపుతామని తెలిపారు. కొత్త సమయాలు ఈ నెల 10 నుంచి అమల్లోకి తీసుకొస్తామని హైదరాబాద్ మెట్రో వెల్లడించింది

4:39 PM IST:

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక హాట్ టాపిక్. ఇవాళే ఈ ఉపఎన్నికకు నోటిఫికేషన్ వెలువడి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమయ్యింది. మొదటిరోజు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రజా ఏక్తా పార్టీ నుండి నాగరాజు, స్వతంత్ర అభ్యర్థిగా వెంకట్ రెడ్డి నామినేషన్ వేసారు. 

4:00 PM IST:

ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 30 పాయింట్లు నష్టపోయి 58,191 వద్ద, నిప్టీ 17 పాయింట్లు నష్టపోయి 17,314 వద్ద స్థిరపడ్డాయి.  

3:14 PM IST:

ఈ ఏడాది ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి బెలారస్ కు చెందిన మానవ హక్కుల కార్యకర్త అలెస్ బైలియాట్ కు దక్కింది. ఆయనతో పాటు రష్యా, ఉక్రెయిన్ దేశాలకు చెందిన మానవ హక్కుల సంస్థలు 'మెమోరియల్', 'సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్' కు శాంతి బహుమతి దక్కింది. 

1:30 PM IST:

మునుగోడు ఉపఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైన నేపథ్యంలో టీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఖరారు చేసారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని టీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. 

11:38 AM IST:

నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో నోటీసులు అందుకున్న కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివకుమార్ ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు. డిల్లీలోని ఈడి కార్యాలయంలో శివకుమార్ విచారణ కొనసాగుతోంది. 
 
10:33 AM IST:

భారతదేశంలో కరోనా కేసులు రోజురోజుకు మరింత తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం 30,362 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో కేవలం 1997 కొత్తకేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదయిన కరోనా కేసులు 4,46,06,460 కు చేరితే మరణాలు 5,28,754 కు చేరాయి. 

9:47 AM IST:

ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో మరోసారి ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీతో పాటు పంజాబ్, హైదరాబాద్ లలో సుమారు 35 ప్రదేశాల్లో సోదాలు సాగుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే సోదాలు చేపట్టినట్లు ఈడీ కేంద్ర కార్యాలయ వర్గాల వెల్లడించాయి, 

9:44 AM IST: