నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

Friday 21st October Telugu News Live

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...
 
9:37 PM IST

ఏపీలో డిసెంబర్‌లో ‘‘ముందస్తు’’ : బొండా ఉమా

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డిసెంబర్‌లో ముందస్తు ఎన్నికలకు వెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు. సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోవడంతో పాటు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్ధితుల కారణంగానే జగన్ ముందస్తు ఆలోచన చేస్తున్నారని బొండా వ్యాఖ్యానించారు.

8:57 PM IST

మునుగోడులో మరో అధికారిపై ఈసీ వేటు

మునుగోడు ఉపఎన్నిక ఏర్పాట్లలో లోపాలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. షిప్‌కు బదులుగా మరో గుర్తును ముద్రించిన అధికారిపై వేటు వేశారు. మండల రెవెన్యూ అధికారిని సస్పెండ్ చేస్తూ తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు చేశారు. అలాగే బ్యాలెట్ పత్రాల ముద్రణ పనిలో వున్న ఇతర అధికారుల నుంచి కూడా వివరణ తీసుకున్నారు.

8:10 PM IST

టెక్కలిలో జనసేన కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడి

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జనసేన కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి దిగాయి. శుక్రవారం సాయంత్రం దాదాపు 30 మంది కార్యకర్తలు మెరుపు దాడికి దిగడంతో కార్యాలయంలో ఫర్నీచర్ ధ్వంసమైంది. ఈ విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు భారీగా చేరుకున్నారు . దీంతో టెక్కలిలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి.

7:27 PM IST

గాంధీ భవన్‌లో టీ.కాంగ్రెస్ కీలక సమావేశం

హైదరాబాద్ గాంధీ భవన్‌లో టీ.కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో మునుగోడు ఉపఎన్నికపై చర్చిస్తున్నారు. అలాగే రాహుల్ గాంధీ పాదయాత్రపైనా సమాలోచనలు చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో వ్యవహారంపైనా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

6:44 PM IST

హైదరాబాద్‌లో భారీగా హవాలా సొమ్ము పట్టివేత

హైదరాబాద్‌ పాతబస్తీలో భారీగా హవాలా నగదు పట్టబడింది. రూ.కోటి పది లక్షల నగదును పట్టుకున్నారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 
6:01 PM IST

సుఖేష్ గుప్తాకు ఈడీ కస్టడీ

ఎంబీఎస్ జ్యువెలర్స్ అధినేత సుఖేష్ గుప్తాను తొమ్మిది రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించింది కోర్ట్. ఈ నెల 25 నుంచి నవంబర్ 2 వరకు సుఖేష్ గుప్తాకు కస్టడీ విధించింది కోర్ట్. సోదాల్లో రూ.150 కోట్ల బంగారు ఆభరణాలు, రూ.2 కోట్లు సీజ్ చేశారు ఈడీ అధికారులు.

5:25 PM IST

టీఆర్ఎస్‌లో చేరిన స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్

బీజేపీకి రాజీనామా చేసిన స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్‌లు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో వీరిద్దరూ టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు.

4:25 PM IST

త్వరలోనే విశాఖ రాజధానిగా ఏపీలో పాలన..: సజ్జల సంచలనం

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని వివాదంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. మూడు రాజధానుల నిర్ణయానికే వైసిపి ప్రభుత్వం కట్టుబడి వుందని... త్వరలోనే విశాఖపట్నం నుండి పాలన ప్రారంభమవుతుందని సజ్జల పేర్కొన్నారు. 

4:14 PM IST

నేడు స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 104 పాయింట్ల లాభంతో 59,307 వద్ద, నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 17,576 వద్ద ముగిసాయి. 

3:20 PM IST

బిజెపికి మరో షాక్... మాజీ ఎమ్మెల్సీ స్వామి గౌడ్ రాజీనామా

మునుగోడు ఉపఎన్నిక సమయంలో బిజెపికి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ తో పాటు ఇవాళ దాసోజు శ్రవణ్ బిజెపిని వీడనున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ జాబితాలో మాజీ ఎమ్మెల్సీ స్వామి గౌడ్ చేరారు.  బిజెపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు స్వామి గౌడ్ ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామాకు గల కారణాలను వివరిస్తూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు లేఖ రాసారు స్వామి గౌడ్. 

3:14 PM IST

పొంచివున్న మరో తుఫాను ముప్పు ... ఐఎండి హెచ్చరిక

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఇది ఈ నెల 22నాటికి వాయుగుండం, 23నాటికి తీవ్ర వాయుగుండం, 24నాటికి తుఫానుగా మారే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. ఈ తుఫాను ఒడిషా తీరాన్ని తాకే అవకాశాలున్నాయని తెలిపారు. తుఫాను ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ ముందస్తుగానే హెచ్చరించింది. 
  
2:19 PM IST

విశాఖ ఘటనలో మరో 9మంది జనసైనికులకు బెయిల్....

ఇటీవల విశాఖపట్నం విమానాశ్రయం వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులకు కారకులంటూ పోలీసులు అరెస్ట్ చేసిన జనసేన నాయకులకు బెయిల్ పై విడుదలయ్యాయి.  ఇప్పటికే పలువురు బెయిల్ పై విడుదలగా మరో 9 మందికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

1:41 PM IST

టీఆర్ఎస్ లో చేరతారంటూ ప్రచారం... బిజెపి నేత విఠల్ క్లారిటీ

బిజెపిని వీడి తిరిగి టీఆర్ఎస్ లో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని టిఎస్ పిఎస్సి మాజీ సభ్యులు సిహెచ్ విఠల్ ఖండించారు. సీఎం కేసీఆర్ తనకు ఫోన్ చేసి టీఆర్ఎస్ లో చేరాలని కోరినట్లుగా జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమని తెలిపారు. నా చివరిశ్వాస వరకు బిజెపిలోనే కొనసాగుతానని విఠల్ పేర్కొన్నారు. 

12:51 PM IST

మునుగోడు ఉపఎన్నిక వేళ బిజెపికి షాక్ ... దాసోజు శ్రవణ్ రాజీనామా

మునుగోడు ఉపఎన్నిక వేళ తెలంగాణ బిజెపికి మరో షాక్ తగిలింది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపిలో చేరిన దాసోజు శ్రవణ్ ఈ పార్టీని విడనున్నట్లు ప్రకటించారు. మునుగోడులో బిజెపి వ్యవహరిస్తున్న తీరువల్లే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు శ్రవణ్ లేఖ రాసారు. 

12:21 PM IST

అరుణాచల్ లో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్

అరుణాచల్ ప్రదేశ్‌లో భారత ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ప్రస్తుతం హెలికాప్టర్ శిథిలాలు పడిన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి వుంది. 

11:56 AM IST

అయోధ్య రామయ్యను దర్శించుకోనున్న ప్రధాని మోదీ

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఆదివారం (23న) ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య రామున్ని దర్శించుకోనున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని పరిశీలించడంతో పాటు సీతారామచంద్రులకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.  

11:05 AM IST

సరికొత్త వేషధారణలో మోదీ... కేధారేశ్వరున్ని దర్శించుకున్న ప్రదాని

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రముఖ దేవాలయం కేదార్ నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఉత్తరాఖండ్ సాంప్రదాయ వేషధారణలో ఆలయానికి చేరుకున్న ప్రధాని కేదారేశ్వరున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసారు. 

10:04 AM IST

కొనసాగుతున్న రూపాయి పతనం ... యూఎస్ డాలర్ = రూ.82.91

అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి పతనం కొనసాగుతోంది. యూఎస్ డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ మరో 12 పైసలు దిగజారింది. దీంతో డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ 82.91 వద్ద నిలిచింది. 

9:36 AM IST

భారత్ లో కొత్తగా 2,119 కరోనా కేసులు

ఇండియాలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గత 24గంటల్లో దేశవ్యాప్తంగా కేవలం 2,119 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదయిన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,38,636 కు చేరితే మృతుల సంఖ్య 5,28,953 కు చేరింది. 

9:28 AM IST

ఏపీలో ముగిసిన రాహుల్ గాంధీ పాదయాత్ర

భారత్ జోడో యాత్ర పేరిట కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర ఆంధ్ర ప్రదేశ్ లో ముగిసింది. కర్ణాటక నుండి ఏపీలోకి ప్రవేశించిన రాహుల్ యాత్ర దాదాపు 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుని మళ్లీ కర్ణాటకలోకే ప్రవేశించింది.  
 
9:37 PM IST:

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డిసెంబర్‌లో ముందస్తు ఎన్నికలకు వెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు. సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోవడంతో పాటు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్ధితుల కారణంగానే జగన్ ముందస్తు ఆలోచన చేస్తున్నారని బొండా వ్యాఖ్యానించారు.

8:57 PM IST:

మునుగోడు ఉపఎన్నిక ఏర్పాట్లలో లోపాలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. షిప్‌కు బదులుగా మరో గుర్తును ముద్రించిన అధికారిపై వేటు వేశారు. మండల రెవెన్యూ అధికారిని సస్పెండ్ చేస్తూ తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు చేశారు. అలాగే బ్యాలెట్ పత్రాల ముద్రణ పనిలో వున్న ఇతర అధికారుల నుంచి కూడా వివరణ తీసుకున్నారు.

8:10 PM IST:

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జనసేన కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి దిగాయి. శుక్రవారం సాయంత్రం దాదాపు 30 మంది కార్యకర్తలు మెరుపు దాడికి దిగడంతో కార్యాలయంలో ఫర్నీచర్ ధ్వంసమైంది. ఈ విషయం తెలుసుకున్న జనసేన కార్యకర్తలు భారీగా చేరుకున్నారు . దీంతో టెక్కలిలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి.

7:27 PM IST:

హైదరాబాద్ గాంధీ భవన్‌లో టీ.కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో మునుగోడు ఉపఎన్నికపై చర్చిస్తున్నారు. అలాగే రాహుల్ గాంధీ పాదయాత్రపైనా సమాలోచనలు చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో వ్యవహారంపైనా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

6:44 PM IST:

హైదరాబాద్‌ పాతబస్తీలో భారీగా హవాలా నగదు పట్టబడింది. రూ.కోటి పది లక్షల నగదును పట్టుకున్నారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 
6:01 PM IST:

ఎంబీఎస్ జ్యువెలర్స్ అధినేత సుఖేష్ గుప్తాను తొమ్మిది రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించింది కోర్ట్. ఈ నెల 25 నుంచి నవంబర్ 2 వరకు సుఖేష్ గుప్తాకు కస్టడీ విధించింది కోర్ట్. సోదాల్లో రూ.150 కోట్ల బంగారు ఆభరణాలు, రూ.2 కోట్లు సీజ్ చేశారు ఈడీ అధికారులు.

5:25 PM IST:

బీజేపీకి రాజీనామా చేసిన స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్‌లు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో వీరిద్దరూ టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు.

4:25 PM IST:

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని వివాదంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. మూడు రాజధానుల నిర్ణయానికే వైసిపి ప్రభుత్వం కట్టుబడి వుందని... త్వరలోనే విశాఖపట్నం నుండి పాలన ప్రారంభమవుతుందని సజ్జల పేర్కొన్నారు. 

4:14 PM IST:

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 104 పాయింట్ల లాభంతో 59,307 వద్ద, నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 17,576 వద్ద ముగిసాయి. 

3:23 PM IST:

మునుగోడు ఉపఎన్నిక సమయంలో బిజెపికి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ తో పాటు ఇవాళ దాసోజు శ్రవణ్ బిజెపిని వీడనున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ జాబితాలో మాజీ ఎమ్మెల్సీ స్వామి గౌడ్ చేరారు.  బిజెపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు స్వామి గౌడ్ ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామాకు గల కారణాలను వివరిస్తూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు లేఖ రాసారు స్వామి గౌడ్. 

3:14 PM IST:

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఇది ఈ నెల 22నాటికి వాయుగుండం, 23నాటికి తీవ్ర వాయుగుండం, 24నాటికి తుఫానుగా మారే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. ఈ తుఫాను ఒడిషా తీరాన్ని తాకే అవకాశాలున్నాయని తెలిపారు. తుఫాను ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ ముందస్తుగానే హెచ్చరించింది. 
  
2:19 PM IST:

ఇటీవల విశాఖపట్నం విమానాశ్రయం వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులకు కారకులంటూ పోలీసులు అరెస్ట్ చేసిన జనసేన నాయకులకు బెయిల్ పై విడుదలయ్యాయి.  ఇప్పటికే పలువురు బెయిల్ పై విడుదలగా మరో 9 మందికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

1:41 PM IST:

బిజెపిని వీడి తిరిగి టీఆర్ఎస్ లో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని టిఎస్ పిఎస్సి మాజీ సభ్యులు సిహెచ్ విఠల్ ఖండించారు. సీఎం కేసీఆర్ తనకు ఫోన్ చేసి టీఆర్ఎస్ లో చేరాలని కోరినట్లుగా జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమని తెలిపారు. నా చివరిశ్వాస వరకు బిజెపిలోనే కొనసాగుతానని విఠల్ పేర్కొన్నారు. 

12:52 PM IST:

మునుగోడు ఉపఎన్నిక వేళ తెలంగాణ బిజెపికి మరో షాక్ తగిలింది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపిలో చేరిన దాసోజు శ్రవణ్ ఈ పార్టీని విడనున్నట్లు ప్రకటించారు. మునుగోడులో బిజెపి వ్యవహరిస్తున్న తీరువల్లే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు శ్రవణ్ లేఖ రాసారు. 

12:21 PM IST:

అరుణాచల్ ప్రదేశ్‌లో భారత ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ప్రస్తుతం హెలికాప్టర్ శిథిలాలు పడిన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి వుంది. 

11:56 AM IST:

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఆదివారం (23న) ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య రామున్ని దర్శించుకోనున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని పరిశీలించడంతో పాటు సీతారామచంద్రులకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.  

11:05 AM IST:

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రముఖ దేవాలయం కేదార్ నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఉత్తరాఖండ్ సాంప్రదాయ వేషధారణలో ఆలయానికి చేరుకున్న ప్రధాని కేదారేశ్వరున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసారు. 

10:04 AM IST:

అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి పతనం కొనసాగుతోంది. యూఎస్ డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ మరో 12 పైసలు దిగజారింది. దీంతో డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ 82.91 వద్ద నిలిచింది. 

9:36 AM IST:

ఇండియాలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గత 24గంటల్లో దేశవ్యాప్తంగా కేవలం 2,119 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదయిన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,38,636 కు చేరితే మృతుల సంఖ్య 5,28,953 కు చేరింది. 

9:28 AM IST: