Asianet News TeluguAsianet News Telugu

బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు టెక్కీలు మృతి...

మృతులు బెంగళూరుకు చెందిన నలుగురు సాఫ్ట్‌వేర్ నిపుణులుగా తేలింది. ఈ ప్రమాదం శుక్రవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో కనకపుర రోడ్డులోని నైస్ రోడ్డులో జరిగింది. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరంతా బొమ్మనహళ్లి నుండి కెంగేరీ వస్తున్నారు. వీరంతా 30 ఏళ్ల వయస్సులోని వారే.

four techies dead, 6 injured in a road accident in bangalore
Author
Hyderabad, First Published Jan 8, 2022, 9:16 AM IST

బెంగళూరు : bangaloreలో శుక్రవారం రాత్రి ఘోర road accident జరిగింది. ట్రక్కు, కారు ఢీకొన్న ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా నలుగురు techies మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ట్రక్ డ్రైవర్ over speed, నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు తెలిపారు.

"బెంగళూరులోని పూర్వాంకర అపార్ట్‌మెంట్ సమీపంలోని నైస్ రోడ్డులో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ ట్రక్కు అనేక వాహనాలను ఢీకొట్టింది" అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ వెస్ట్ కుల్దీప్ జైన్ తెలిపారు.

"ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులతో సహా మొత్తం నలుగురు వ్యక్తులు మరణించారు. దీనిమీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం" అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరో ఆరుగురికి గాయాలయ్యాయని, వారు చికిత్స పొందుతున్నారని వారు తెలిపారు.

మృతులు బెంగళూరుకు చెందిన నలుగురు సాఫ్ట్‌వేర్ నిపుణులుగా తేలింది. ఈ ప్రమాదం శుక్రవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో కనకపుర రోడ్డులోని నైస్ రోడ్డులో జరిగింది. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరంతా బొమ్మనహళ్లి నుండి కెంగేరీ వస్తున్నారు. వీరంతా 30 ఏళ్ల వయస్సులోని వారే. పదిన్నర గంటల సమయంలో TN- రిజిస్టేషన్ తో ఉన్న ట్రక్ అత్యంత వేగంగా వచ్చి..కేరళ లైసెన్స్ ప్లేట్ కలిగిన మారుతీ వ్యాగన్ఆర్‌ను ఢీకొట్టింది.

ట్రక్కు వేగంగా వచ్చి గుద్దడంతో.. అంతే వేగంగా వాగన్ ఆర్ ముందుకున్న కార్లను ఢీ కొట్టింది. దీంతో పలు వాహనాలు ఒకదానికొకటి ఢీ కొట్టుకున్నాయి. వాటిల్లో ఉన్న నలుగురు వ్యక్తులు వాహనాల మధ్య ఇరుక్కుపోయి.. బైటికి రాలేక నలిగి చనిపోయారు. ఈ ప్రమాదంలో మూడు ట్రక్కులు, ఐదు కార్లు ఒకదానికొకటి ఢీ కొట్టాయి.

అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంలో రెండు కార్లు మినహా మిగతా వాహనాలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయి. నలుగురు చనిపోవడంతో పాటు మరికొందరు గాయపడ్డారని కుమారస్వామి లేఅవుట్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరినీ వివిధ ఆసుపత్రులకు తరలించినందువల్ల క్షతగాత్రులు, మృతుల సంఖ్య ఇంకా ఖచ్చితంగా నిర్ధారించలేదు.

ఇదిలా ఉండగా, డిసెంబర్ 25న తెలంగాణలోని మేడ్చల్ లో ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది. ఈ ఘటన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎదులాబాద్ కు చెందిన బత్తుల హనుమాన్ దాస్ గౌడ్, నిరంజని దంపతులు.  వీరు ఘట్‌కేసర్ నుంచి ఎదులాబాద్‌కు బైక్ పై వెళ్తున్నారు. అదే సమయంలో మద్యం మత్తులో స్టూడెండ్లు డ్రైవింగ్ చేస్తున్న కారు అతి వేగంగా వచ్చి హనుమాన్ దాస్ గౌడ్, నిరంజనలు వెళ్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. 

దీంతో నిరంజని అక్కడికక్కడే మరణించింది. ఆమె భర్త హనుమాన్ దాస్ గౌడ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి హనుమాన్ దాస్ గౌడ్‌ను ఆస్పత్రికి తరలించారు. అలాగే, ప్రమాదానికి కారణమైన కారు, నిందిత విద్యార్థులను స్థానికులే పట్టుకున్నారు. వారిని పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. కాగా, ఇద్దరు విద్యార్థులు మాత్రం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన చోటుచేసుకోగానే... బాధితుల పక్షాన నిలుస్తూ గ్రామ ప్రజలు కదలి వచ్చారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారికి నచ్చజెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios