Asianet News Telugu

డేటింగ్ యాప్ లో పరిచయం.. యువకుడిపై గ్యాంగ్ రేప్..!

అక్కడకు వెళ్లిన తర్వాత అక్కడ మరో ముగ్గురు యువకులు ఉన్నారు. మొత్తం నలుగురు సదరు యువకుడిపై అత్యాచారానికి పాల్పడ్డారు. 

Four men arrested in UP for gang-raping man they met on dating app
Author
Hyderabad, First Published Jun 12, 2021, 10:50 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

డేటింగ్ యాప్ లో పరిచయం పెంచుకొని.. ఓ యువకుడిపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా... నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడికి డేటింగ్ యాప్ లో మరో యువకుడు పరిచయమయ్యాడు. కలుద్దామని చెప్పి.. ఓ ప్రాంతానికి రావాల్సిందిగా కోరాడు. దీంతో.. ఆ యువకుడు వెంటనే అతను చెప్పిన ప్రాంతానికి వెళ్లాడు.

అక్కడకు వెళ్లిన తర్వాత అక్కడ మరో ముగ్గురు యువకులు ఉన్నారు. మొత్తం నలుగురు సదరు యువకుడిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత దానంతటినీ వీడియో తీసి.. తర్వాత వాటిని  చూపించి బెదిరించడం మొదలుపెట్టారు.

తమ ఎకౌంట్ లోకి డబ్బులు ఇవ్వాలని.. లేదంటే వీడియోలు లీక్ చేస్తామంటూ బెదిరించడం మొదలుపెట్టారు. దీంతో.. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

నిందితులు గౌతమ్, గౌరవ్(23), సచిన్(26),, మోహిత్ (25) గా గుర్తించారు. వీరంతా సిబ్లింగ్స్ అని తెలుస్తోంది. డేటింగ్ యాప్ తో తొలుత బాధితుడిని గౌతమ్ పరిచయం  చేసుకోగా.. మిగిలిన వారితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios