భువనేశ్వర్:  ఒడిశాలోని డెంకనాల్‌ జిల్లా అళాసువా ప్రాంతంలో రైస్ మిల్లు ప్రహరీ గోడ కూలి నలుగురు ఆదివారం నాడు మృతి చెందారు.  ఈ ప్రహరీగోడ శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారని అనుమానిస్తున్నారు.

ఆదివారం నాడు సంతలో రద్దీ ఎక్కువగా ఉంది. ఈ ప్రమాదం చోటు చేసుకొందని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ ఘటనలో  మరో 11 మంది స్వల్పగాయాలతో బయటపడ్డారు.  

గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.  ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.