Bihar: డీజిల్ లేని పోలీసు వ్యాన్‌ను తోసుకెళ్లిన నిందితులు.. వీడియో వైరల్
డీజిల్ లేని పోలీసు వ్యాన్‌ను నిందితులతో ముందుకు నెట్టించారు. అర కిలోమీటర్ మేరకు వారితో వ్యాన్‌ను తోసివేయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
Bihar Police: సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతున్నది. ఓ పోలీసు వ్యాన్‌ను నలుగురు నిందితులు అర కిలోమీటర్ మేరకు తోసుకెళ్లారు. వ్యాన్‌లో డీజిల్ అయిపోవడంతో పోలీసు అధికారుల ఆజ్ఞ మేరకు ఆ నలుగురు వ్యాన్‌ను తోశారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది.
మద్యపానంపై నిషేధం ఉన్న బిహార్‌లో ఆల్కహాల్ సేవించిన నేరం కింద నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని కోర్టులో హాజరుపరచాల్సి ఉన్నది. వారిని కోర్టుకు తరలిస్తుండగా వ్యాన్‌లో డీజిల్ అయిపోయింది. దీంతో ఆ నలుగురిని కిందికి దింపారు. ఆ వ్యాన్‌ను తోయాల్సిందిగా ఆదేశించారు. దీంతో ఆ నిందితులు వ్యాన్‌ను తోశారు.
భగల్‌పూర్‌లోని కాచాహరి చౌక్ వద్ద ఆ వ్యాన్ నిలిచిపోయింది. వారు తోస్తుండగా ఒకరు వీడియో తీశారు. ఇద్దరు నిందితుల నడుముకు తాడు కట్టేసి ఉన్నది.
Recently in Bihar , A Police Van carrying inmates to jail ran out of fuel and then inmate had to push the vehicle to get started 😂 #BiharPolice #Biharpolitics pic.twitter.com/fHwobgtTgo
— TRENDING VIDEOS (@Abnormal_trend) February 4, 2024
Also Read: PM Modi: కరెంట్ బిల్లు జీరో చేయడానికి కేంద్రం అడుగులు: ప్రధాని మోడీ
ఈ ఘటనపై ఏసీపీ ప్రమోద్ నారాయణ్ సింగ్ స్పందించారు. ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని, త్వరలోనే దర్యాప్తు ప్రారంభిస్తామని చెప్పారు. బాధ్యులు ఎవరైనా వారిపై యాక్షన్ తీసుకుంటామని తెలిపారు.