Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌కు షాక్.. పార్టీ వీడిన మాజీ సీఎం.. తృణమూల్ కాంగ్రెస్ వైపు చూపు.. రేపు కోల్‌కతాకు ప్రయాణం

కాంగ్రెస్‌కు మరో షాక్ ఎదురైంది. తీర రాష్ట్రంలో గోవాలో మాజీ సీఎం(Former CM) లూజిన్హో ఫెలిరో తన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు, టీఎంసీ చేరే సంకేతాలను ఇచ్చారు. తన రాజీనామాకు ముందు మమతా బెనర్జీపై ప్రశంసలు కురిపించారు. బీజేపీలో కాంగ్రెస్ క్రమంగా బలహీనపడుతుండటంతో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఫెలిరో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
 

former CM quit congress likely to join congress
Author
Panaji, First Published Sep 27, 2021, 5:36 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

పనాజీ: గోవా(Goa) మాజీ సీఎం, కాంగ్రెస్(Congress) సీనియర్ నేత లూజిన్హో ఫెలిరో పార్టీ వీడారు. దాదాపు 40 ఏళ్లు కాంగ్రెస్‌లో కొనసాగిన ఫెలిరో తాజాగా, తన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. గోవాలోని నావెలిమ్ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహించారు. వచ్చే ఏడాది జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికలపై దీర్ఘాలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. తన రాజీనామా(Resignation)కు కొంత వ్యవధి ముందే తృణమూల్ కాంగ్రెస్‌పై ప్రశంసలు కురిపించారు. గోవాకు మమతా బెనర్జీ(Mamata banerjee) అవసరమున్నదని అన్నారు.

నరేంద్ర మోడీకి మమతా బెనర్జీ టఫ్ సవాల్ విసిరారని, బెంగాల్‌(West Bengal)లో మమతా ఫార్ములానే గెలిచిందని అన్నారు. కాంగ్రెస్ బృహత్ కుటుంబంలోనే తాను కొనసాగుతానని చెప్పారు. పరోక్షంగా టీఎంసీలోకి చేరుతారని సంకేతాలనిచ్చారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఎన్సీపీ, టీఎంసీలాంటి కాంగ్రెస్‌లను ప్రస్తావిస్తూ నాలుగు కాంగ్రెస్‌లలో మోడీని మమతా బెనర్జీనే సమర్థంగా ఎదుర్కొన్నారని చెప్పారు. అయితే, అధికారికంగా తాను టీఎంసీలోకి చేరనున్నట్టు ఇంకా వెల్లడించలేదు. కానీ, రేపు కోల్‌కతాకు ప్రయాణం కానున్నట్టు తెలిసింది. రేపు లేదా ఎల్లుండి ఆయన మమతా బెనర్జీని కలువనున్నట్టు సమాచారం.

తాను కొంతకాలంగా హుందాగా కనిపిస్తున్న మౌనాన్ని భరించలేకపోతున్నారని అన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు అధికారాన్ని కట్టబెట్టిన పౌరులూ ఇదే మౌనంతో బాధపడుతున్నారని తెలిపారు. ఈ మౌనానికి అంతం పలకాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. గోవాలో జెండా ఎగరేయడానికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నది. గోవా ఎన్నికలకు సిద్ధం కావాలని దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఇటీవలే బహిరంగంగా పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

గోవాలో దీర్ఘకాలం అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నది. ప్రమోద్ సావంత్ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు పాలన సాగిస్తున్నది. కాగా, క్రమంగా అక్కడ కాంగ్రెస్ బలహీనపడుతుంటే ఆప్ విపరీతంగా ప్రచారం చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఫెలిరో టీఎంసీనే గోవాకు సరిగ్గా సరిపోతుందని భావించినట్టు తెలుస్తున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios