మసాజ్ సెంటర్ల పేరిట నిర్వహిస్తున్న వ్యభిచారం గుట్టు రట్టు అయ్యింది. థాయిలాండ్ కి చెందిన యువతులతో స్పా సెంటర్ లో రహస్యంగా కొంతకాలంగా ఈ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. కాగా... వీరి గుట్టును పోలీసులు బయటపెట్టారు. దాదాపు 35 మందిని ఈ ఘటనలో అరెస్టు చేశారు. వారిలో 25మంది మహిళలు ఉన్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో ఆదివారం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా నగరంలోని 14 స్పా కేంద్రాలపై పోలీసులు ఆదివారం అర్దరాత్రి దాడులు చేయగా విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం సాగిస్తున్న దందా వెలుగుచూసింది. నోయిడా సీనియర్ ఎస్పీ వైభవ్ కృష్ణ నేతృత్వంలోని 14 పోలీసు బృందాలు స్పా కేంద్రాలపై రాత్రివేళ దాడి చేశాయి. 

ఈ దాడుల్లో థాయ్‌లాండ్‌తో పాటు పలు విదేశాలకు చెందిన 25 మంది అమ్మాయిలను పోలీసులు అరెస్టు చేశారు. మరో పదిమంది పురుషులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి లక్షరూపాయల నగదు, బీరు బాటిళ్లు, వినియోగించని కండోమ్ లు పోలీసులకు లభించాయి. స్పా పేరిట విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నారని అందిన ఫిర్యాదుల మేర పోలీసులు దాడి చేసి 14 స్పా కేంద్రాలకు సీలు వేశారు. స్పా పేరిట సాగుతున్న వ్యభిచార దందాకు పోలీసులు బ్రేక్ వేశారు.