Asianet News TeluguAsianet News Telugu

చాక్లెట్స్, బర్గర్ ఇచ్చి .. నా డ్రస్ తీసేసి.... కన్న తండ్రిపై 9ఏళ్ల బాలిక కామెంట్స్

భర్త సెక్స్ పిచ్చితో ఎన్ని బాధలుపెట్టినా మౌనంగానే భరించింది. కొన్ని సార్లు ఈ విషయాన్ని తల్లిదండ్రుల వద్ద ప్రస్తావిస్తే.. వాళ్లు తననే సర్ధుకుపోమని చెప్పేవాళ్లని ఆవేదన వ్యక్తం చేసింది. కడుపున పుట్టిన కూతురిపై కూడా పలు మార్లు అత్యాచారం చేయడంతో... ఆమె పోలీసులను ఆశ్రయించింది.

forced himself on me, child on father's sexual abuse
Author
Hyderabad, First Published Sep 23, 2019, 11:14 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కట్టుకున్న భార్యను శారీరకంగా, మానసికంగా వేధించడంతోపాటు... రక్తం పంచుకుపుట్టిన బిడ్డపట్ల  కూడా అతను దారుణంగా ప్రవర్తించాడు. కూతురు కళ్ల ముందే భార్య పట్ల దారుణంగా ప్రవర్తించేవాడు.  కన్న కూతురనే ఇంగిత భావన కూడా లేకుండా... 9ఏళ్ల చిన్నారిపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తనను బాధపెట్టినంత వరకు భరించిన ఆ స్త్రీ... భర్త కన్ను కూతురిపై కూడా పడటంతో తట్టుకోలేకపోయింది. తన చిన్నారిపై భర్త అత్యాచారం చేయడాన్ని భరించలేకపోయింది. దీంతో.. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతోపాటు.. తన భర్తను శిక్షించాలంటూ న్యాయపోరాటం చేస్తోంది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ యువతికి కొన్ని సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి 9ఏళ్ల కుమార్తె కూడా ఉంది. పెళ్లిన నాటి నుంచి ఆమెను భర్త శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. చాలా సంవత్సరాల పాటు బాధను భరిస్తూనే జీవితం సాగించింది. భర్త సెక్స్ పిచ్చితో ఎన్ని బాధలుపెట్టినా మౌనంగానే భరించింది. కొన్ని సార్లు ఈ విషయాన్ని తల్లిదండ్రుల వద్ద ప్రస్తావిస్తే.. వాళ్లు తననే సర్ధుకుపోమని చెప్పేవాళ్లని ఆవేదన వ్యక్తం చేసింది. కడుపున పుట్టిన కూతురిపై కూడా పలు మార్లు అత్యాచారం చేయడంతో... ఆమె పోలీసులను ఆశ్రయించింది.

ఈ సందర్భంగా బాధిత మహిళ మాట్లాడుతూ... ‘ నా భర్త పెడుతున్న బాధలు భరించలేక చాలా సార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. కానీ నా కూతురిని చూసి ఆగిపోయానని చెప్పారు. భర్తను సెక్స్ పిచ్చి ఎక్కువ... అతని కారణంగా చాలా నొప్పులు భరించాల్సి వచ్చేది. కన్న కూతురని చూడకుండా కూతురిపై కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. చాక్లెట్ ఇస్తానని చెప్పి బలవంతంగా తీసుకొని వెళ్లి మరీ అత్యాచారానికి పాల్పడ్డాడు. నా కూతురిని చూసుకోని ఎన్నో రాత్రులు ఒంటరిగా ఏడ్చేదాన్ని’ అంటూ ఆమె వివరించారు.

కాగా... చిన్నారి విషయంలో అతని తండ్రి ఎలా ప్రవర్తించారో చెప్పమని పోలీసులు అడగగా... ఆ చిన్నారి రాసిన ఉత్తరం అందరినీ విస్మయానికి గురిచేసింది. ‘‘ నాకు ఈ నాన్న వద్దు.. మళ్లీ మా నాన్న ముఖం నేను చూడాలని అనుకోవడం లేదు. జీవితంలో అతనిని చూడను. మా నాన్న నన్ను, మా అమ్మను చాలా బాధలుపెట్టాడు.  చాలా చెడు పనులు చేసేవాడు. నా కళ్లముందే చాలా సార్లు అమ్మ డ్రస్సు చింపివేయడాన్ని నేను చూశాను. నాతో కూడా నాన్న చెడుగా ప్రవర్తించాడు. కొన్ని సార్లు కనీసం అమ్మకు అన్నం కూడా పెట్టేవాడు కాదు. ఆ సమయంలో నాకు మాత్రం మంచి ఫుడ్ పెట్టేవాడు. చాక్లెట్లు, బర్గర్, పిజ్జా.. నాకు నచ్చినవన్నీ కొనిపెట్టేవాడు. తర్వాత నా డ్రస్ తేసేసి చెడుగా ప్రవర్తించేవాడు. ఒక్కోసారి నన్ను స్కూల్ నుంచి తానే ఇంటికి తీసుకువెళ్లాడు. నాన్న నాతో చెడుగా ప్రవర్తించినప్పుడు చాలా నొప్పిగా ఉండేది. నాలుగు, ఐదుసార్లు అలా చేసిన తర్వాత నొప్పి తగ్గిపోయింది.’’ అంటూ చిన్నారి రాసిన ఉత్తరం చూసి అందరూ కంగుతిన్నారు. పోలీసులకు కూడా కళ్ల వెంట నీరు కారాయి. 

కూతరు రాసిన ఆ లేఖ చూసి ఆమె తల్లి విపరీతంగా విలపించింది. తన భర్తకు ఎలాగైనా శిక్ష విధించాలని ఆమె ఈ సందర్భంగా పోలీసులను కోరింది. మొదట సమాజం గురించి భర్త అరాచకాలను భయటపెట్టలేకపోయానని.. కానీ.. తన కూతురు భవిష్యత్తు కోసమైనా అతనిని శిక్షించాలని భావించినట్లు ఆమె చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios