Asianet News TeluguAsianet News Telugu

మహిళలే టార్గెట్ గా హైవేలపై కాపుకాసి అత్యాచారాలకు పాల్పడే.. సీరియల్ గ్యాంగ్ రేప్ ల ముఠా అరెస్ట్..

జాతీయ రహదారులపై ప్రయాణించే మహిళలకు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారాలకు పాల్పడే  కిరాతక ముఠాను రాజస్థాన్లోని ప్రతాప్ గఢ్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.  ఈ ముఠాలో ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి కొన్ని అశ్లీల వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. 15 రోజులకు ఒకసారి హైవేలపై ఇలాంటి నేరాలకు ఈ ముఠా  తెగబడేదని పోలీసులు తెలిపారు. వీరంతా వరుస గ్యాంగ్ రేప్ లకు పాల్పడినట్లు  వీడియో లనుబట్టి తెలుస్తోందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

five men involved in serial gang rapes arrested in rajasthan
Author
Hyderabad, First Published Jan 20, 2022, 6:40 AM IST

జైపూర్ : హైవేలపై వెళ్లాలంటే వణుకు.. ముఖ్యంగా జంటలకు వెన్నులోంచి జలదరింపు... చీకటి పడిందంటే చాలు ముష్కరులు చెలరేగి పోయేవారు.. భర్త ముందే భార్యను, ప్రియుడి ముందే ప్రియురాలిని.. ఇలా వెంట ఉన్న మగతోడు ముందే మహిళల మీద పాశవికంగా సామూహిక అత్యాచారానికి దిగేవారు. మగవాళ్లను దారుణంగా కొట్టి, వారి దగ్గరున్నదంతా దోచుకునేవారు. ఆ దారుణాన్ని వీడియో చిత్రీకరించి.. ఎవ్వరికీ చెప్పద్దంటూ బాధితులను బెదిరించేవారు. ఈ సీరియల్ గ్యాంగ్ రేప్ ల ముఠా చివరికి పోలీసులకు చిక్కింది. అయితే వీరంతా 20యేళ్లలోపువారే కావడం, వీరిలో ఓ మైనర్ కూడా ఉండడం.. విశేషం.

National highwaysపై ప్రయాణించే womenలకు కిడ్నాప్ చేసి gang rapeలకు పాల్పడే  కిరాతక ముఠాను రాజస్థాన్లోని ప్రతాప్ గఢ్ జిల్లా పోలీసులు arrest చేశారు.  ఈ ముఠాలో ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి కొన్ని Pornographic videosను స్వాధీనం చేసుకున్నారు. 15 రోజులకు ఒకసారి హైవేలపై ఇలాంటి నేరాలకు ఈ ముఠా  తెగబడేదని పోలీసులు తెలిపారు. వీరంతా వరుస గ్యాంగ్ రేప్ లకు పాల్పడినట్లు  వీడియో లనుబట్టి తెలుస్తోందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

ఎనిమిది మందితో కూడిన ఈ ముఠాలో ఎక్కువమంది 20 ఏళ్ల వయస్సు కలిగిన వారేనని.. వీరంతా Robbery, kidnappingలకు పాల్పడుతున్నారని ప్రతాప్ గఢ్ జిల్లా ఎస్పీ అమృతా దుహాన్ వెల్లడించారు. అరెస్టయిన వారిలో minor కూడా  ఉన్నట్లు ఆమె తెలిపారు. పలువురు బాలికలపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సమయంలో తీసిన వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.

ఓ పెట్రోల్ బంక్ లో దోపిడీకి ప్రణాళిక చేస్తుండగా పోలీసులు అక్కడికి వెళ్లి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు అక్కడి నుంచి తప్పించుకున్నారు. నిందితుల నుంచి కారం, రెండు కర్రలు, కత్తులు, నైలాన్ తాడు, ఇనుపరాడ్, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలోని అందరికీ నేరచరిత్ర ఉందని పోలీసులు తెలిపారు.

వీరంతా కూరగాయల వ్యాపారంతో పాటు ధరియావాడ్ లో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. మద్యం మత్తులో ప్రతి పది నుంచి పదిహేను రోజులకోసారి అత్యాచారాలకు ప్లాన్ చేసే వారని పేర్కొన్నారు.  ద్విచక్ర వాహనాలు రోడ్లపై నిలిపి.. జంటలను లక్ష్యంగా మాటు వేసే వారని పోలీసులు తెలిపారు. దంపతులు కనబడగానే వ్యక్తిపై దాడి చేసి, అతడి నుంచి దోచుకుని... మహిళలు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దారుణానికి పాల్పడేవారిని వివరించారు. 

అనంతరం ఆ మహిళను గ్రామ శివార్లలో వదిలి వెళ్లే వారు. అంతేకాకుండా ఈ దారుణాన్ని మొబైల్ ఫోన్లలో చిత్రీకరించేవారు. పోలీసులకు ఈ విషయం చెబితే వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామంటూ బాధితులను బెదిరించే వారిని పోలీసులు తెలిపారు. ఈ సీరియల్ రేప్ ల ముఠాను అరెస్ట్ చేయడంతో చీకటి పడ్డాక హైవేలపై వెళ్లే జంటలకు కాస్త ఉపశమనం లభించినట్టయ్యింది. 

Follow Us:
Download App:
  • android
  • ios