కేరళ రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రజలకు సరైన మార్గంలో పెట్టాల్సిన మతబోధకులే దారి తప్పారు. తమ కామ వాంచ తీర్చుకోడానికి ఓ వివాహితపై దారుణానికి పాల్పడ్డారు. బెదిరింపులకు దిగుతూ ఒకరి తర్వాత ఒకరు మొత్తం ఐదుగురు క్రైస్తవ మతబోధకులు అత్యాచారానికి పాల్పడ్డారు.

 ఈ అమానుష ఘటన కేరళలోని కొట్టాయం ప్రాంతంలోని మలంకర సాంప్రదాయ చర్చిలో చోటుచేసుకుంది. బాధితురాలి భర్త ఈ దారుణంపై మాట్లాడుతూ.. మొదట ఓ పాస్టర్ బాధిత మహిళను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ విషయాన్ని ఆమె మరో ఫాస్టర్ కు తెలిపి సహయం కోరింది. అయితే అతడు ఆమెకు సాయం చేయకపోగా ఈ విషయాన్ని అందరికి చెబుతానని చెప్పి బెదిరించి  అతడు కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇలా మొత్తం ఐదుగురు ఫాస్టర్లు తన భార్యపై దాడి చేసినట్లు బాధితురాలి భర్త తెలిపాడు.

ఈ దారుణం పై బాధితురాలి భర్త చర్చి సెక్రటరీ బీజూ ఒమన్ కు ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫాస్టర్లపై చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఐదుగురిని సస్పెండ్ చేసి, ఈ ఘటనపై విచారణ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. నివేదిక వచ్చిన తర్వాత  వారిపై తదుపరి చర్యలు తీసుకుంటామని సెక్రటరీ తెలిపారు.