Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరం డిజైన్ వెనుక ఆస‌క్తిక‌ర‌మైన క‌థ.. !

Ayodhya Ram Mandir: అయోధ్యలో నిర్మితమవుతున్న రామాలయం అద్భుతమైన వాస్తు, శిల్పకళా నైపుణ్యంతో నిర్మితమవుతోంది. అయితే, భవ్య రామమందిరం నిర్మాణ డిజైన్ వెనుక ఒక ఆస‌క్తిక‌ర‌మైన స్టోరీ ఉంది. రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్రమిశ్రా.. ఏషియా నెట్ న్యూస్ కు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో దాని గురించి వెల్ల‌డించారు. 
 

Explained : True story behind the Ayodhya Ram Mandir design

Ayodhya Ram Mandir: అయోధ్యలో నిర్మితమవుతున్న రామాలయం అద్భుతమైన వాస్తు, శిల్పకళా నైపుణ్యంతో నిర్మితమవుతోంది. రామాలయ నిర్మాణికి సంబంధించి ఇప్పటివరకు జరగిన.. జరుగుతున్న పనుల గురించి రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్రమిశ్రా.. ఏషియా నెట్ న్యూస్ కు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. 2023 డిసెంబర్ నుంచి భక్తులను దర్శనానికి రామాల‌యం అందుబాటులోకి తీసుకురావ‌డానికి నిర్మాణ ప‌నులు జ‌రుగుతున్నాయి. అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించిన ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుతున్నాయి. ఆలయ పనులు పూర్తి కావడానికి మరో సంవత్సరం పట్టినప్పటికీ..  భ‌క్తులు, యాత్రికులు గర్భగుడిలో ప్రార్థనలు చేసుకోవ‌డానికి వీలుగా నిర్మాణం పూర్తికానుంది. "

అయితే అయోధ్య రామమందిరం డిజైన్ గురించి మరింత ఆసక్తికరమైన క‌థ ఉంది. దీనిని రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఏషియానెట్ న్యూస్ కు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆలయ నిర్మాణ శైలి గురించి మిశ్రాను ప్రశ్నించగా, "ఆలయ వాస్తుశిల్పి శ్రీ (చంద్రకాంత్) సోంపురా. గుజరాత్ లోని సోంపురా కుటుంబం దేవాలయాలను మాత్రమే నిర్మిస్తుంది. ఈ ఒప్పందం 1992లో సంతకం చేయబడింది. ఆర్కిటెక్ట్ కు 1992లో ఈ ఉద్యోగం ఇచ్చారు. అతను అన్ని దేవాలయాల వివ‌రాల త‌ర్వాత‌.. ఈ అయోధ్య రామ ఆలయాన్ని 'నగర' నిర్మాణ శైలిలో నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. దానికి అనుగుణంగా వివ‌రాలు అందించారు" అని తెలిపారు. సోంపురా కుటుంబంతో సంబంధం క‌లిగిన దేవాల‌యాలు భార‌త దేశంలోనే కాకుండా ప్ర‌పంచంలోని చాలా దేశాల్లో వంద‌ల సంఖ్య‌లో ఉన్నాయ‌ని ఆయ‌న తెలిపారు. "వాస్తవానికి చంద్రకాంత్ తన తండ్రి ప్రభాకర్ సోంపురాతో కలిసి గుజరాత్ లోని సోమనాథ్ ఆలయంలో పనిచేశాడు. చంద్రకాంత్ ప్రతిపాదించిన 'నగర' శైలిలో.. ఆలయ గర్భగుడి అష్టభుజి ఆకారంలో ఉండగా.. ఆలయ చుట్టుకొలత వృత్తాకారంగా ఉంటుంది" అని తెలిపారు. 

"ఈ రూపకల్పనను చాలా మంది మత పెద్ద‌ల‌కు అందించారు. వ్యక్తిగత అభిప్రాయాలు కూడా అయోధ్యలోని మత పెద్దల నుండి తీసుకోబడ్డాయి. ఆయ‌ల డిజైన్ గురించి ముందుగానే.. ఈ విధంగా నిర్మిస్తున్నామని మేము చెప్పాము. వాస్తవానికి, మేము అసాధార‌ణ‌మైన‌.. ప్రత్యేకమైన దాని కోసం చూస్తున్నామని చెప్పడం సులభమే.. అయితే, ఈ నిర్మాణ క‌ళా చాలా ఆకట్టుకునే పరిమాణాన్ని కలిగి ఉంటుంది" అని రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్రమిశ్రా అన్నారు. రామమందిరం ఆధునికత, విశ్వాసాల  మిశ్రమంగా ఎలా ఉంటుందో వివరిస్తూ.."మతపరమైన మనోభావాలతో మిళితమైన సాంకేతిక లక్షణాలను అనేక విధాలుగా, ఇంజనీర్లు ఆడిట్ చేశారు. వారు నిర్మాణ రూపకల్పన బహుశా అత్యంత అనువైన డిజైన్లలో ఒకటి..  1000 సంవత్సరాల ఆల‌యం చెక్కుచెద‌ర‌కుండా ఉండే విధంగా ఆయ‌ల నిర్మాణ‌ లక్ష్యానికి అనుగుణంగా ఉంటుందని సిఫార్సు చేశారు" అని తెలిపారు. "రఘువంశ సంప్రదాయానికి అనుగుణంగా డిజైన్ ఉన్నట్లు కనిపిస్తోందని సాధువులు మరియు మత పెద్దలు కూడా ఆమోదించారు. ఆ విధంగానే డిజైన్ ను రూపొందించాం' అని  నృపేంద్రమిశ్రా  తెలిపారు. ఆలయ నిర్మాణం కోసం రాజ‌స్థాన్ నుంచి తీసుకువ‌చ్చిన బన్సీ పహాడ్ రాయిని ఉప‌యోగిస్తున్నారు. దేశంలోని టాప్ ఇంజినీర్లు ఆల‌య నిర్మాణం కోసం ప‌నిచేస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios