ఉన్నావ్ రేప్ కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ పై హత్యా కేసు నమోదైంది. ఉన్నావ్ బాధితురాలు తండ్రి చావుకి కుల్దీప్ ని కారణం చేస్తూ.. ఆయనపై హత్యా కేసు నమోదు చేశారు. ఈ కేసులో కుల్దీప్ ప్రధాన నిందితుడని సీబీఐ కోర్టు తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసుని సీబీఐ దర్యాప్తు చేస్తుంది.

బాధితురాలిపై 2017 జూన్ 4వ తేదీన సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు సీబీఐ కోర్టుకు విన్నవించింది. తనకు జరిగిన అన్యాయాన్ని బాధితురాలు ముఖ్యమంత్రికి లేఖ రాసినా పట్టించుకోలేదని సీబీఐ అధికారులు తెలిపారు. బాధితురాలి తండ్రిని పోలీసులు చావగొట్టారని చెప్పారు. 2018 ఏప్రిల్ 9వ తేదీన పోలీస్ కస్టడీలోనే బాధితురాలి తండ్రి చనిపోయినట్లు ఈ సందర్భంగా సీబీఐ కోర్టుకు వెల్లడించింది.

అతని చావుకి కూడా మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ ని కారణం చేస్తూ.. తాజాగా హత్య కేసు నమోదు  చేశారు. ఇదిలా ఉండగా బాధితురాలిపై కూడా హత్యాయత్నం చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. కుల్దీప్ తో పాటు మరో పదిమందిపై కూడా ఈ కేసు నమోదు చేశారు. కాగా ప్రస్తుతం బాధితురాలు ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతోంది.