ప్రస్తుతం ప్రముఖ రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సీనీ ప్రముఖులు, సెలబ్రిటీలు ఫిట్ నెస్ చాలెంజ్ పేరుతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో చాలా మంది కేవలం ప్రచారం కోసమే ఫిట్ నెస్ చాలెంజ్ ను స్వీకరించి ఎప్పుడూ చేయని ఎక్సర్ సైజ్ లు చేస్తున్నారు. కానీ ఈ 86 ఏళ్ల మాజీ ప్రధాని తనకు ఈ ఛాలెంజ్ లు ఏవీ అవసరం లేదని నిరూపించారు. ఇప్పుడు కాదు తాను చాలా ఏళ్ల నుండి తన ఫిట్ నెస్, ఆరోగ్యం కాపాడుకునే పనిలోనే ఉన్నానని తెలియజేశారు. ఇంతకూ ఆ ఫిట్ నెస్ మాజీ ప్రధాని ఎవరనుకుంటున్నారా? ఆయనేనండీ కర్ణాటక కురువృద్దుడు, రాజకీయ ఉద్దండుడు దేవె గౌడ.

ఇపుడైతే ఈ ఫిట్ నెస్ ఛాలెంజ్ ఫేరుతో హడావుడి చేసి కఠిన వర్కవుట్ లు చేస్తూ వీడియో తీసి చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.  కానీ ఆరోగ్యం కోసం ఇలా ఎక్సర్ సైజ్ లు, యోగా లు చేయాలి కానీ ప్రచారం కోసం కాదని దేవె గౌడ నిరూపించారు. అతడు గత కొన్నేళ్లుగా కార్తీక్ అనే ప్రత్యేక ట్రైనర్ సాయంతో రోజూ ఉదయం ఎక్సర్ సైజ్ లు చేస్తారు. కానీ ఏనాడూ ఈ విషయంలో ప్రచారాన్ని కోరుకోలేదు.

ఇంకా తన ఆరోగ్యం గురించి దేవెగౌడ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆయన చాలా మితమైన ఆహారం తీసుకుంటూ, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతారు. ఇక మద్యం, స్మోకింగ్ వంటి దురలవాట్లను ధరికి కూడా చేరనీయలేదు. అలాగే మాంసాహారం కాకుండా కేవలం శాఖాహారం మాత్రమే తీసుకుంటూ దైవెగౌడ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు.