ఇంకా విషమంగానే వాజ్‌పేయి ఆరోగ్యం..

First Published 15, Jun 2018, 11:12 AM IST
EX PM Atal Bihari Vajpayee Still In AIIMS ICU
Highlights

ఇంకా విషమంగానే వాజ్‌పేయి ఆరోగ్యం.. 

భారత  మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది.. ఛాతి, మూత్ర నాళ ఇన్ఫెక్షన్‌ తదితర సమస్యలతో ఈ నెల 11న వాజ్‌పేయి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు.. నాటి నుంచి ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా ఆధ్వర్యంలో అత్యవసర చికిత్సను అందజేస్తున్నారు.. అటల్‌జీ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఆయన చికిత్సకు సహకరిస్తున్నారని.. వైద్యులు బుధవారం తెలిపారు.. అయితే తాజాగా వాజ్‌పేయికి ఐసీయూలోనే చికిత్స కొనసాగిస్తున్నట్లు ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహన్, వసుంధరరాజేతో పాటు పలువురు మాజీ ప్రధానిని  పరామర్శించారు.

loader