పోర్న్ వీడియోలకు బానిసగా మారిన ముగ్గురు బాలురు ... వాటిని చూసి ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.

రాజస్థాన్ కి చెందిన  ముగ్గురు బాలురు పోర్న్ వీడియోలకు బానిసలయ్యారు.  వాటిని చూసి 8ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రాజస్థాన్‌లోని శ్రీరంగనగర్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆమెను పరీక్షించిన డాక్టర్లు అత్యాచారం జరిగినట్లు చెప్పడంతో తల్లి షాకైంది. ఏం జరిగిందని చిన్నారిని ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది. దీంతో ఆమె వెంటనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ముగ్గురు బాలురను అరెస్ట్ చేశారు. వీరి వయసు 8, 10, 12 ఏళ్లే కావడంతో అంతా షాకయ్యారు. విచారణలో తామే అత్యాచారానికి పాల్పడినట్లు అంగీకరించారు. పోర్న్ వీడియోలు చూస్తున్న సమయంలో బాలిక కనిపించడంతో కోరిక ఆపుకోలేక ఆమెను పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు నిందితులు తెలిపారు.

 నిందితుల్లో ఒక బాలుడు తన తండ్రి మొబైల్‌లో పోర్న్ వీడియోలు చూస్తూ మిగతా వారికి కూడా అలవాటు చేశాడని పోలీసులు తెలిపారు. నిందితులపై రేప్ కేసు నమోదుచేసి కోర్టులో హాజరుపరిచామని, అనంతరం జువైనల్ హోమ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.