చెన్నై ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ కార్గో విమానంలో కోటి 65 లక్షల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను పట్టుకున్నారు.

వీటిలో 5,210 ఎండీఎంఏ ట్యాబ్లెట్లు సహా పలు రకాల డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. నెదర్లాండ్స్, బెల్జియం నుంచి అక్రమంగా పార్శీళ్లలో ఈ డ్రగ్స్ రవాణా చేసినట్లు అధికారులు గుర్తించారు.

రెండు పార్శిళ్లలో ఒకటి ఏపీలోని అడ్రస్‌కు వచ్చినట్లు గుర్తించారు అధికారులు. దీని ఆధారంగా ఓ యువకుడిని అరెస్ట్ చేశారు. మరో రెండు పార్శిళ్లు తమిళనాడులోని కంచి అడ్రస్‌కు వచ్చినట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.