Asianet News TeluguAsianet News Telugu

తెలుగు సినీ నటి సంజనకు షాక్: ఇంటిపై సీసీబీ దాడులు

తెలుగు సినీ నటి సంజన ఇంటిపై బెంగళూరు సీసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్సు వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో సంజనకు ఇప్పటికే నోటీసులు జారీ అయ్యాయి.

Drugs case: CCB raids heroine Sanjana's resdence
Author
Bengaluru, First Published Sep 8, 2020, 7:41 AM IST

బెంగళూరు: కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసు కలకలం సృష్టిస్తోంది. తెలుగు సినీ నటి సంజన ఇంటిపై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు మంగళవారం ఉదయం దాడులు నిర్వహించారు. ఇప్పటికే ఆమె మేనేజర్ ను సిసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  విచారణకు హాజరు కావాలని సీసీబీ అధికారులు ఇప్పటికే నోటీలసులు జారీ చేశారు. 

డ్రగ్స్ కేసులో సినీ నటి రాగిణి ద్వివేదితో పాటు శివ ప్రకాష్ ను సీసీబీ అధికారులు అరెస్టు చేశారు. రాగిణి ద్వివేదిని సీసీబీ అధికారులు విచారించారు. ఆమె వెల్లడించిన వివరాల ఆధారంగా 12 మందిపై సిసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

సంజనకు డ్రగ్స్ సప్లయిర్స్ తో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. సంజన మిత్రుడిని సీసీబీ అధికారులు ఇప్పటికే విచారించారు. సంజనను సీసీబీ అధికారులు తమ కార్యాలయానికి తీసుకుని వెళ్లే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. 

గత రెండు మూడు నెలలుగా సంజన, రాగిణి ద్వివేదిలను కలిసినవారిని కూడా సీసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించవచ్చునని అంటున్నారు. డ్రగ్స్ కేసు చుట్టుముట్టుడుతున్న క్రమంలో కొంత మంది బెంగళూరు నుంచి హైదరాబాదుకు వెళ్లాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు సీసీబీ అధికారులు గుర్తించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios