Asianet News TeluguAsianet News Telugu

ఐఏఎస్ ఆకాశ్ పై వరకట్న వేధింపుల కేసు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య వందన...

కర్ణాటక ఐఏఎస్ అధికారి ఆకాశ్ శంకర్ పై భార్య వందన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. భర్త, అతని కుటుంబం వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొంది. 

Dowry harassment case against IAS Akash shanker, Wife Vandana complained to the police, karnataka - bsb
Author
First Published Jul 19, 2023, 9:14 AM IST

కర్ణాటక : ఓ భర్త, అత్తామామలు, అత్తగారి కుటుంబం మీద అతని భార్య వేధింపుల కేసు నమోదు చేసింది. భర్త, అత్తవారి కుటుంబం సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కర్ణాటకలోని బెంగళూరు కొడిగేహళ్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే  ఆ భర్త  సాదాసీదా మనిషి కాదు.. ఐఏఎస్ ఆఫీసర్. అది కూడా అప్పట్లో సివిల్స్ లో దేశం వ్యాప్తంగా 100లోపు ర్యాంకు తెచ్చుకుని అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి. అతనే కొడగు జెడ్పి సీఈవోగా పనిచేస్తున్న ఆకాశ్ శంకర్. 

ఆ సమయంలో ఆయన విజయాన్ని అందరూ ఆస్వాదించారు. మీడియాలో అతని ఇంటర్వ్యూలు విపరీతంగా వచ్చాయి. ఐఏఎఎస్ కావాలనుకునేవారు ఆకాష్ ను ఆదర్శంగా తీసుకున్నారు. కానీ.. చదువులోఉన్నతంగా ఉన్న అతను వ్యక్తిగతంగా మాత్రం అంత పరిణితి చెందలేదని ఈ ఘటన నిరూపిస్తోంది. భార్యను వేధింపులకు గురి చేసి.. ప్రస్తుతం పోలీసుల కేసుల్లో పడ్డాడు. ఆకాశ్ శంకర్ మీద ఆయన భార్య డాక్టర్ వందన ఫిర్యాదు చేసింది.

వ్యాపారంలో లాభాలు వస్తాయని మేనకోడలిని బలిచ్చిన వ్యాపారి.. పంజాబ్ లో ఘటన

నిరుడు జూన్ లో ఆకాష్ శంకర్, వందనల వివాహం వైభవంగా జరిగింది. వందన రిటైర్డ్ ఐపీఎస్ టిఆర్ సురేష్ కుమార్తె. పెళ్లి సమయంలో భారీగా కట్న కానుకలు కూడా ఇచ్చారు. అయితే, ఆ తరువాత మరింత బంగారం, డబ్బు, విలువైన కానుకలు తేవాలని అత్తమామలు ఆమె మీద వేధింపులకు గురి చేస్తున్నారని మార్చిలో వందన ఆరోపించింది. ఈ ఆరోపణలు నేపద్యంలో దంపతులిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు.

కాగా,ఇటీవల ఆకాష్ శంకర్ సోదరుడు వికాస్ శంకర్, అతని భార్య చేతన,  ఐసిడి శివకుమార్ అనే వ్యక్తులు వందన గురించి హేళనగా మాట్లాడారు. దాన్ని వీడియోలు తీసి.. ఆమె స్నేహితులకే పంపారు. అందులో ఆమె మీద చాలా ఘోరమైన తప్పుడు ప్రచారాలు చేశారు. ట్రాఫికర్ డాక్టర్ వందన, ట్రాఫికింగ్ ఆఫ్ ఖాకీస్ డాటర్ అని తప్పుడు ప్రచారానికి దిగారు. 

దీనిమీద డాక్టర్ వందన ఆవేదన వ్యక్తం చేసింది. దీంతోపాటు తన కుటుంబం గురించి సోషల్ మీడియాలో ఘోరంగా రాతలు రాసినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనిమీద విచారణ చేపట్టినట్లు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios