Asianet News TeluguAsianet News Telugu

సబర్మతీలో ట్రంప్ అలా: రాజ్ ఘాట్ బుక్ లో మాత్రం గాంధీ ప్రస్తావన

సబర్మతీ అశ్రమం సందర్శకులు డైరీలో మహాత్మా గాంధీ పేరు ప్రస్తావించని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాజ్ ఘాట్ వద్ద సందర్శుకుల డైరీలో మాత్రం ప్రస్తావించారు. ట్రంప్ దంపతులు మహాత్మా గాంధీ స్మారకాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

Donald Trump's Message On "Great Mahatma Gandhi" At Rajghat After Sabarmati Slip
Author
New Delhi, First Published Feb 25, 2020, 2:45 PM IST

న్యూఢిల్లీ: రాజ్ ఘాట్ లోని విజిటర్స్ బుక్ లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మహాత్మా గాంధీ పేరును ప్రస్తావించారు. సబర్మతీ ఆశ్రమంలో మహాత్మా గాంధీ పేరును ప్రస్తావించకుండా సందేశం రాసి విజిటర్స్ బుక్ లో సంతకం చేశారు. మంగళవారంనాడు ట్రంప్ మహాత్మా గాంధీ స్మారకాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విజిటర్స్ బుక్ లో గాంధీని పేరును రాశారు. 

రాష్ట్రపతి భవన్ లో స్వాగతం అందుకున్న తర్వాత డోనాల్డ్ ట్రంప్ దంపతులు మహాత్మా గాంధీ స్మారకాన్ని సందర్శించారు. రాజ్ ఘాట్ వద్ద విజిటర్స్ బుక్ లో గ్రేట్ మహాత్మా గాంధీ విజన్ అయిన  సార్వభౌమత్వ, అద్భుత భారతదేశం కోసం అమెరికా ప్రజలు నిలబడుతారని ఆయన విజిటర్స్ బుక్ లో రాశారు. 

సబర్మతీ ఆశ్రమం విజిటర్స్ బుక్ లో ట్రంప్ సందేశం రాసి సంతకం పెట్టారు. మహాత్మా గాంధీని ఆయన ప్రస్తావించలేదు. అద్భుతమైన పర్యనటకు సంబంధించిన తన గొప్ప మిత్రుడు ప్రధాని మోడీకి ధన్యావాదాలు అంటూ అందులో రాశారు. 

 

ట్రంప్ దంపతులు సోమవారంనాడు సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. సబర్మతీ ఆశ్రమాన్ని చూపిస్తూ విశేషాలను వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ వారి వెంట ఉన్నారు. ఆ తర్వాత నమస్తే మోడీ కార్యక్రమంలో పాల్గొనేందుకు మొతెరా స్టేడియం బయలుదేరి వెళ్లారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ట్రంప్ కుటుంబ సభ్యులు భారత్ కు వచ్చారు. వారి పర్యటన మంగళవారం సాయంత్రంతో ముగుస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios