దారుణం: మహిళపై ఏడాదిగా డాక్టర్ రేప్, వీడియో తీసి ఇలా..

Doctor rapes woman and blackmailed her for a year
Highlights

రోగిపై డాక్టర్ రేప్

లక్నో: చికిత్స కోసం వచ్చిన  మహిళ రోగిపై అత్యాచారానికి పాల్పడడమే కాకుండా ఆ దృశ్యాలను వీడియో తీశాడు ఓ డాక్టర్. అంతేకాదు ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పెడతానని  ఆమెను బ్లాక్‌మెయిల్ కు పాల్పడుతూ ఏడాది కాలంగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు.ఇటీవల కాలంలో ఈ వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ కు చెందిన వైద్యుడు సాజిద్ హసన్ వద్దకు ఓ మహిళ  చెకప్ కోసం వచ్చింది.అయితే ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించే పేరుతో అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు ఆ దృశ్యాలను  తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేశాడు. 

తన వద్ద ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఏడాదిగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు.ఈ వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అంతేకాదు గతంలో కూడ తన వద్దకు వచ్చిన ఓ మైనర్ బాలికపై కూడ  నిందితుడు అత్యాచారానికి పాల్పడినట్టు కేసు  కూడ నమోదైంది.


 

loader