మహిళపై ఏడాది పాటు డాక్టర్ రేప్: వీడియోతో బ్లాక్ మెయిల్

Doctor Allegedly Raped Woman For A Year
Highlights

ఓ మహిళపై ఓ వైద్యుడు ఏడాది పాటు పరుసగా అత్యాచారం చేస్తూ వచ్చాడు.

ముజఫర్ నగర్: ఓ మహిళపై ఓ వైద్యుడు ఏడాది పాటు పరుసగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరాన్ పూర్ పట్టణంలో జరిగింది. వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు 

అత్యాచార ఘటనను వైద్యుడు వీడియో రికార్డింగ్ కూడా చేశాడు. దాన్ని చూపి బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చాడు. బాధితురాలు కైథోరా గ్రామానికి చెందింది. 

సాజిద్ హసన్ అనే వైద్యుడిని సోమవారం అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం - మహిళ ఏడాది క్రితం మెడికల్ చెకప్ కోసం సాజిద్ క్లినిక్ కు వెళ్లింది. అప్పుడు అతను ఆమెపై అత్యాచారం చేశాడు. దాన్ని వీడియోలో చిత్రీకరించాడు.

వీడియోను సోషల్ మీడియాలో పెడుతానంటూ బెదిరిస్తూ అతను మహిళపై పదే పదే అత్యాచారం చేస్తూ వచ్చాడు. 

loader