Asianet News TeluguAsianet News Telugu

మసాజ్ సెంటర్లో వ్యభిచారం... కుప్పలుగా కండోమ్స్, రేట్ కార్డ్స్

మసాజ్ పార్లర్‌లో కండోమ్‌లతో పాటు అమ్మాయిల పేరిట రేట్ కార్డులు లభించాయి. యువతుల అశ్లీల ఫోటోలతోపాటు వారి రేటు ఎంత అనేది పేర్కొంటూ రేట్ కార్డులు మసాజ్ పార్లర్‌లో లభించడం సంచలనం రేపింది. 

Delhi: Sex racket operating in garb of massage parlour busted, four women rescued
Author
Hyderabad, First Published Oct 2, 2019, 8:00 AM IST

మసాజ్ సెంటర్ పేరిట వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును మహిళా కమిషన్ రట్టు చేసింది.ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ నేతృత్వంలోని ఓ బృందం ఢిల్లీలోని బురారీ ప్రాంతంలోని మసాజ్ పార్లర్ పై ఆకస్మిక దాడులు చేసింది. 

ఈ దాడుల్లో మసాజ్ పార్లర్‌లో కండోమ్‌లతో పాటు అమ్మాయిల పేరిట రేట్ కార్డులు లభించాయి. యువతుల అశ్లీల ఫోటోలతోపాటు వారి రేటు ఎంత అనేది పేర్కొంటూ రేట్ కార్డులు మసాజ్ పార్లర్‌లో లభించడం సంచలనం రేపింది. ఈ మసాజ్ పార్లర్ నుంచి గతంలోనూ నలుగురు అమ్మాయిలను మహిళా కమిషన్ కాపాడింది. పశ్చిమ ఢిల్లీలోని ద్వారక, ఇతర ప్రాంతాల్లోని మసాజ్ పార్లర్లు, స్పాలపై మహిళా కమిషన్ బృందం ఆకస్మిక దాడులు చేసింది. ఈ దాడుల్లో వ్యభిచారం రాకెట్ బాగోతం బయటపడింది. దీంతో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios