వ్యభిచార గృహంపై ఢిల్లీ పోలీసులు దాడి చేసి ఐదుగురును అదుపులోకి తీసుకున్నారు. వీరిని పట్టుకునేందుకు పోలీసు కానిస్టేబుల్ విటుడిగా ఇంటిలోకి ప్రవేశించాడు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అరెస్టు చేశారు.
ఢిల్లీ నగరంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న దిల్షాద్ కాలనీలో సెక్స్ రాకెట్ ను పోలీసులు ఛేదించారు. ఓ ఇంటిపై దాడి చేసి నలుగురు మహిళలను, ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. వీరిని అదుపులోకి తీసుకునేందుకు
పోలీసులు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు.
దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దిల్షాద్ కాలనీలో కొంత కాలంగా వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్లాన్ చేశారు. అందులో భాగంగా ఓ పోలీసు కానిస్టేబుల్ ను విటుడిగా ఆ ఇంట్లోకి పంపించారు. అతడు లోపలకు వెళ్లి దర్శన్ సైనీ అనే నిందితుడిని కలుసుకున్నారు.
సైనీ కానిస్టేబుల్ ను మరో మహిళకు పరిచయం చేశారు. ఆమె అతడి నుంచి రూ.1,500 వసూలు చేసింది. ముగ్గురు అమ్మాయిలను అతడికి పరిచయం చేసింది. దీంతో కానిస్టేబుల్ వెంటనే పోలీసులు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు బృందం వెంటనే అక్కడికి చేరుకొని ఐదుగురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. నిందితులపై సీమపురి పోలీసు స్టేషన్ లో అనైతిక ట్రాఫిక్ (నివారణ) చట్టం 1956 కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యభిచారం కొనసాగుతున్న ఇంటి యజమానురాలు దీప పరారీలో ఉంది. కేసుపై విచారణ కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా ఏప్రిల్ 12వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వ్యభిచార గృహం పోలీసులు దాడి చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియాకు వివరించారు. జిల్లా కేంద్రంలో రెడ్డి బజార్ లో వ్యభిచారం జరుగుతోందనే సమాచారం రావడంతో టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ గండ్రతి మోహన్, మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ ఎడ్లపల్లి సతీష్ లు సిబ్బందితో కలిసి ఆ ఇంటిపై దాడి చేశారు. అందులో వ్యభిచారం నిర్వహిస్తున్న కొంత మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొందరు సర్వోదయ సంస్థలో పనిచేస్తున్న వారు కాగా మరి కొందరు ఇతర ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొన్నూరులో ఏప్రిల్ 9వ తేదీన ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. ఈ సమయంలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
