దారుణం: మద్యం తాగించి ఆరు గంటలు యువతిపై రేప్

Delhi: Man Trespasses Woman's House,   Rapes Her For Six Hours
Highlights

యువతిపై లైంగిక దాడి

న్యూఢిల్లీ: ఆరు గంటల పాటు ఓ యువతిని లైంగికంగా
వేధింపులకు గురిచేసిన సందీప్ అనే యువకుడు. ఇప్పటికే
పలువురు మహిళలపై అతను అత్యాచారాలకు పాల్పడ్డాడు.
అయితే ఈ కేసుల్లో అరెస్టై బెయిల్‌పై బయటకు వచ్చినా
అతనిలో మార్పు రాలేదు. తాజాగా ఒంటరిగా ఉన్న
యువతిపై ఆ నిందితుడు ఆరు గంటల పాటు లైంగిక
వేధింపులకు పాల్పడ్డాడు.ఈ ఘటన న్యూఢిల్లీలో చోటు
చేసుకొంది.

న్యూఢిల్లీలోని  వసంత్‌ కుంజ్‌లోని రంగ్‌పూరి పహారిలో ఓ
యువతి ఒంటరిగా నివసిస్తోంది. అయితే ఈ విషయాన్ని
గమనించిన సందీప్ అనే యువకుడు ఆ యువతిపై
అత్యాచారానికి పాల్పడ్డాడు. 

ఈ ఏడాది మే 29వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో
ఆఫీస్‌ నుంచి ఆ యువతి ఇంటికి వచ్చింది.ఇంటి  తాళం
తీస్తున్న సమయంలో  వెనక నుండి సందీప్ ఆమెపై దాడి
చేసి ఆమెను ఇంట్లోకి లాక్కెళ్ళాడు.

మంచానికి కట్టేసి ఆమెకు బలవంతంగా మందు
తాగించాడు.ఆరు గంటల పాటు ఆమెపై లైంగిక వేధింపులకు
పాల్పడ్డాడు. అంతేకాదు ఆమె ఆరు గంటలపాటు
ఇతరులతో కాంటాక్ట్‌లోకి వెళ్ళకుండా జాగ్రత్తలు
తీసుకొన్నారు. 

తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆ ఇంటి నుడి
బయటకు వచ్చేశాడు. అయితే బయటకు వచ్చే సమయంలో
ఆమె ఫోన్ ను కూడ తీసుకెళ్ళాడు. అయితే యువతి చెప్పిన
ఆనవాళ్ళ మేరకు  పోలీసులు ఆ యువతికి సందీప్ ఫోటోను
చూపారు. అయితే ఆ ఫోటో చూసిన  బాధితురాలు అతడిని
గుర్తుపట్టింది. నిందితుడిని జూన్ 1వ తేదిన పోలీసులు అరెస్ట్
చేశారు.

సందీప్ పై పలు కేసులు

సందీప్ పై పలు కేసులు నమోదయ్యాయి. 38 ఏళ్ళ సందీప్
కు వివాహమైంది. భార్య, పాప కూడ ఉన్నారు. సందీప్
గతంలో కరాటే శిక్షణ ఇచ్చే ట్రైనర్ గా పనిచేసేవాడు.
ఏడాదిన్నర క్రితం ఓ యువతిపై లైంగిక వేధింపులకు
పాల్పడిన కేసులో తొలిసారిగా సందీప్ అరెస్టయ్యారు.
అతడిపై ఇప్పటికి సుమారు 30 కేసులు నమోదయ్యాయని
పోలీసులు చెబుతున్నారు. 


 

loader