ఒకరి ఇంటి ముందు ఓ వృద్ధుడు చీకట్లో మూత్రం పోశాడు. ఈ చిన్న విషయం పెద్ద రాద్ధాంతం కాగా... చివరికి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే....  దక్షిణ ఢిల్లీలోని గోవింద్ పూరీ ప్రాంతానికి చెందిన లిలు అనే వ్యక్తి... అతని భార్య సోమవారం రాత్రి ఇంటి ముందు కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో కరెంట్ లేకపోవడంతో కాస్త చీకటిగా ఉంది. ఆ సమయంలో అదే వీధిలో ఉండే ఓ వృద్ధుడు  చీకట్లో కళ్లు సరిగా కనపడగా... లిలు ఇంటి ముందు మూత్ర విసర్జన చేశాడు.

అది గమనించిన లిలు... ఆగ్రహంతో ఊగిపోయాడు. తన ఇంటి ముందు మూత్ర విసర్జన చేస్తావా అంటూ... వృద్ధుడు అని కూడా చూడకుండా చెంపదెబ్బ కొట్టాడు. దీనిని గమనించిన ఆ వృద్ధుడు ఇద్దరి కొడుకులు అక్కడికి చేరుకున్నారు. ఈ విషయంలో లిలూకీ వృద్ధుడు ఇద్దరు కొడుకుల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆ ఇద్దరు యువకుల చేతిలో గాయాలపాలై లిలు మృతి  చెందాడు.

లిలు భార్య పింకీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే చనిపోయిన లిలు పెద్ద రౌడీ షీటర్ అని.. అతని పేరిట చాలా కేసులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.