Asianet News TeluguAsianet News Telugu

ఏడేళ్ల చిన్నారిని రేప్ చేసిన దుండగుడు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అరెస్ట్

ఢిల్లీలో ఏడేళ్ల చిన్నారిపై ఓ దుండగుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. కానీ, ఆ వ్యక్తి ఆచూకీ, వివరాలు, నివాసం, చేసే పని వివరాలేవీ తెలియవు. ఒక్క ఐడీ కార్డు.. ఒక్క వివరమూ లేదు. కానీ, 36 గంటల పాటు సీసీటీవీ ఫుటేజీలన పరిశీలించి ఎట్టకేలకు నిందితుడి ఫొటోగ్రాఫ్‌ను ఢిల్లీ పోలీసులు పట్టుకోగలిగారు. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి నిందితుడు ఢిల్లీ వదిలి హర్యానాకు చేరినట్టు పోలీసులు తెలిపారు.
 

delhi girl rape accused find out in CCTV footage
Author
New Delhi, First Published Oct 24, 2021, 1:23 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: Delhiలో దారుణం జరిగింది. ఏడేళ్ల చిన్నారిపై ఓ దుండగుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఏమీ తెలియనట్టు అక్కడి నుంచి జారుకున్నాడు. పోలీసులకు చిక్కకూడదని ముందుజాగ్రత్తగా రాష్ట్రమే మారాడు. ఢిల్లీ నుంచి హర్యానాకు పరారయ్యాడు. కానీ, 36 గంటలపాటు CCTV ఫుటేజీ పరిశీలించి పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.

ఢిల్లీలో రంజీత్ నగర్‌లో శుక్రవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న నిందితుడు ఒంటరిగా ఆడుకుంటున్న Girlని చూశాడు. ఆ చిన్నారిని ప్రలోభపెట్టి తన వెంట నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడే ఆ ఏడేళ్ల బాలికను Rape చేశాడు. తర్వాత అక్కడి నుంచి అటే పరారయ్యాడు. ఆ బాలిక ఏడుస్తూ ఇల్లు చేరింది. తర్వాత తల్లిదండ్రులకు విషయం వివరించింది. తద్వారా విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

నిందితుడు ఢిల్లీ దాటినట్టు పోలీసులకు సమాచారం అందింది. హర్యానాలో ఉన్నట్టు తెలిసింది. ఆ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను 36 గంటల పాటు పోలీసులు పరిశీలించారు. రద్దీగా ఉన్న రంజీత్ నగర్ వీధిని చూపెట్టే సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. బాలికను నిందితుడు ఆశపెట్టడం మొదలు నిందితుడి వెంట చిన్నారి నడుచుకుంటూ వెళ్లడాన్ని చూశారు.

Also Read: కూతురిపై యేళ్ల తరబడి అత్యాచారం, గర్భవతిని చేసిన రేపిస్ట్ తండ్రికి యావజ్జీవం..

సెంట్రల్ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసుల చెప్పిన వివరాల ప్రకారం, ‘36 గంటల కాల వ్యవధిలో వందలాది సీసీటీవీలను పరిశీలించాం. చివరికి ఆ నిందితుడి ఫొటోగ్రాఫ్‌ను కనుగొనగలిగాం. ఈ కేసులో అసలు ఆధారాలేవీ లేకుండానే దర్యాప్తు మొదలుపెట్టాల్సి వచ్చింది. నిందితుడు ఆ ఏరియాలో నివసించేవ్యక్తి కాదు. బాధితురాలితో సంబంధమూ లేదు. ఆయన ఫోన్ నెంబర్, వెహికల్ నెంబర్‌లూ లేవు. చేసే పని తెలియదు. ఒక్క ఐడీ కార్డూ లేదు. ఆయనను గుర్తించడం చాలా కష్టంగానే ఉండింది. సెంట్రల్ డిస్ట్రిక్ట్ నుంచి చాలా పోలీసు బృందాలు నిరాఘాటంగా పని చేశారు. క్రిమినల్‌ను పట్టుకోవడం నిర్విరామంగా పనిచేశారు’ అని తెలిపారు.

బాలిక స్టేట్‌మెంట్ తీసుకోవాల్సి ఉన్నది. తమ దర్యాప్తులో నిందితుడిపై ఇప్పటికే పోక్సో చట్టం కింద ఓ కేసు నమోదైనట్టు తేలింది. ఖ్యాలా పోలీసు స్టేషన్ పరిధిలో ఓ చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు తెలిసింది. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ పోలీసులకు నోటీసులు పంపింది. వీలైనంత తొందరగా దోషిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios