అబాట్ యాంటాసిడ్ డైజీన్ జెల్‌పై డీసీజీఐ అలర్ట్.. ఆ డ్రగ్ రీకాల్ చేసిన కంపెనీ
డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అబాట్ ‘‘యాంటాసిడ్ డైజీన్ జెల్’’పై అలర్ట్ జారీ జారీ చేసింది. డీసీజీఐ నిర్ణయంపై అబాట్ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. డైజీన్ జెల్ యాంటాసిడ్ ఔషధాన్ని స్వచ్ఛందంగా రీకాల్ చేశామన్నారు.

డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అబాట్ ‘‘యాంటాసిడ్ డైజీన్ జెల్’’పై అలర్ట్ జారీ జారీ చేసింది. ఈ కంపెనీ గోవా యూనిట్‌లో తయారు చేయబడిన డైజీన్ జెల్ వాడకాన్ని తక్షణం నిలిపివేయాలని డీసీజీఐ రోగులను కోరింది. ఇదే ఫెసిలిటీలో తయారు చేయబడిన అన్ని బ్యాచ్ నంబర్‌లతో ప్రభావితమైన ఉత్పత్తులను తక్షణం పంపిణీ నుంచి తప్పించాలని టోకు వ్యాపారులను ఆదేశించింది.
జెల్ వినియోగం వల్ల ఉత్పన్నమయ్యే ఏదైనా ఏడీఆర్‌లు (ప్రతికూల ఔషద ప్రతిచర్య) గురించి రోగులకు అవగాహన కల్పించాలని ఆరోగ్య సంరక్షణ నిపుణులను డీసీజీఐ సూచించింది. మార్కెట్‌లో పేర్కొన్న ఔషధ ఉత్పత్తుల తరలింపు, విక్రయం, పంపిణీ, స్టాక్‌పై గట్టి నిఘా ఉంచాలని, సదరు ఉత్పత్తి ఇప్పటికే మార్కెట్లో ఉంటే నమూనాలను సేకరించాలని అన్ని రాష్ట్ర, యూటీ, జోనల్, సబ్ జోనల్ అధికారులను ఆదేశించింది.
డీసీజీఐ నిర్ణయంపై అబాట్ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. రుచి, వాసనపై వినియోగదారుల ఫిర్యాదుల కారణంగా భారత్‌లోని గోవా ఫెసిలిటీలో తయారు చేసిన డైజీన్ జెల్ యాంటాసిడ్ ఔషధాన్ని స్వచ్ఛందంగా రీకాల్ చేశామన్నారు. రోగుల ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నివేదికలు అందలేదని ప్రతినిధి చెప్పారు. డైజీన్ ఇతర రూపాలు, ట్యాబ్లెట్‌లు, స్టిక్ ప్యాక్‌లపై డీసీజీఐ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపదన్నారు. అలాగే గోవా కాకుండా మరో ఫెసిలిటీలో తయారు చేసిన డైజీన్ జెల్ ప్రభావితం కాదన్నారు. ప్రస్తుత డిమాండ్‌ను తీర్చడానికి తగిన పరిమాణంలో నిల్వలు వున్నాయని అబాట్ ప్రతినిధి స్పష్టం చేశారు.
ఆగస్ట్ 9న ఫిర్యాదు మేరకు డిజీన్ జెల్ మింట్ ఫ్లేవర్‌లో ఒక బాటిల్ సాధారణ రుచి (తీపి) లేత గులాబీ రంగులో ఉందని ఒక కస్టమర్ నివేదించారు. అయితే అదే బ్యాచ్‌లోని మరొక బాటిల్ తెలుపు రంగులో చేదు రుచితో ఘాటైన వాసనతో ఉందని గమనించారు. అబాట్ ఇండియా లిమిటెడ్ ఆగస్ట్ 11న డీసీజీఐ కార్యాలయానికి సందేహాస్పద ఉత్పత్తిని స్వచ్ఛందంగా రీకాల్ చేయమని తెలియజేసింది - డైజీన్ మింట్ ఫ్లేవర్ బ్యాచ్ కస్టమర్ , మరో మూడు డిజీన్ జెల్ ఆరెంజ్ ఫ్లేవర్ ద్వారా ఫ్లాగ్ చేశారు. కంపెనీ ఆగస్టు 18న డీసీజీఐ కార్యాలయానికి గోవా ఫెసిలిటీలో తయారు చేయబడిన అన్ని ఫ్లేవర్‌ల (పుదీనా, ఆరెంజ్, మిక్స్ ఫ్రూట్స్ ఫ్లేవర్) డిజీన్ జెల్ అన్ని బ్యాచ్‌ల స్వచ్ఛంద ఉత్పత్తుల రీకాల్ గురించి తెలియజేసింది.