జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని పాలీ జిల్లా ధనేరియా గ్రామంలో ఓ దళిత యువకుడిని చేతులు, కాళ్లు కట్టేసి కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ ‌గా మారింది.  అయితే ఈ దళిత యువకుడిపై దాడి విషయంలో పలు రకాల కథనాలు విన్పిస్తున్నాయి.

ధనేరియా గ్రామంలో  చిన్నారిని దళిత యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలతోనే కొంతమంది అతడిని చేతులు,కాళ్లు కట్టేసి చితకబాదారు.  చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడినందుకే ఆ యువకుడిపై ఫోక్సో కేసు పెట్టారు. అంతేకాదు నిందితుడిని  అరెస్ట్ చేశారు. 

మరో వైపు ఈ దాడిపై మరో కథనం కూడ ప్రచారంలో ఉంది. గ్రామంలోని గుడిలోకి దళిత యువకుడు ప్రవేశించినందున చితకబాదారనే ప్రచారం కూడ ఉంది. దళితుడు ఆలయంలోకి ప్రవేశం చేసినందుకు కాళ్లు, చేతులు కట్టేసి దాడి చేశారనే ప్రచారం కూడ ఉంది.  అయితే విషయమై  స్పష్టత రాలేదు. పోలీసులు మాత్రం చిన్నారిపై లైంగిక దాడి చేసినందుకు నిందితుడిపై కేసు నమోదు చేసింది.