Asianet News TeluguAsianet News Telugu

కానిస్టేబుల్ పై అత్యాచారం.. ! అర్జున అవార్డీ.. సీఆర్‌పీఎఫ్ డీఐజీ, ఇన్‌స్పెక్టర్ల సస్పెన్షన్.. !!

మహిళా కానిస్టేబుల్ ను లైంగికంగా వేధించి కేసులో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పీఎఫ్)డీఐజీ, ఇన్స్ పెక్టర్లను ఆ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ముప్పైయేళ్ల వయసున్న మహిళా కానిస్టేబుల్ మీద సిఆర్పీఎఫ్ డీఐజీ, స్పోర్ట్స్ ఆఫీసరుగా పనిచేస్తున్న ఖజన్ సింగ్, జట్టు కోచ్ గా పనిచేస్తున్న ఇన్ స్పెక్టరు సుర్జిత్ సింగ్ లైంగికంగా వేధించారని ప్రాథమిక దర్యాప్తులో  తేలింది. 

CRPF suspends Arjuna Awardee DIG, inspector after probe indicts duo of sexually harassing constable - bsb
Author
Hyderabad, First Published Apr 2, 2021, 1:21 PM IST

మహిళా కానిస్టేబుల్ ను లైంగికంగా వేధించి కేసులో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పీఎఫ్)డీఐజీ, ఇన్స్ పెక్టర్లను ఆ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ముప్పైయేళ్ల వయసున్న మహిళా కానిస్టేబుల్ మీద సిఆర్పీఎఫ్ డీఐజీ, స్పోర్ట్స్ ఆఫీసరుగా పనిచేస్తున్న ఖజన్ సింగ్, జట్టు కోచ్ గా పనిచేస్తున్న ఇన్ స్పెక్టరు సుర్జిత్ సింగ్ లైంగికంగా వేధించారని ప్రాథమిక దర్యాప్తులో  తేలింది. 

దీంతో వీరిద్దరినీ సస్పెండ్ చేశారు. వీరి వేధింపుల మీద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా డీఐజీ ఖజన్ సింగ్ 1986లో సియోల్ లో జరిగిన ఆసియా క్రీడల్లో రజతపతకం సాధించాడు. 

అర్జున అవార్జీ కూడా అయిన ఖజన్ సింగ్ మహిళా పోలీసును లైంగికంగా వేధించారని వెల్లడైంది. ఈ వ్యవహారం మీద ఐపీఎస్ అధికారిణి చారుసిన్హా దర్యాప్తు సాగిస్తున్నారు. 2014 అక్టోబర్, నవంబర్ లలో ఢిల్లీలోని వసంత్ కుంజ్ లోని ఒక ఫ్లాట్ కు తీసుకువెళ్లి ఖజన్ సింగ్, సుర్జిత్ సింగ్ లు వరుసగా మూడు రోజుల పాటు తన మీద అత్యాచారం చేశారని ఓ మహిళా పోలీసు ఫిర్యాదు చేసింది. 

దీంతో ఈ ఘటన మీద బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ సీఆర్పీఎఫ్ డైరెక్టర్, కేంద్ర హోంశాఖ కార్యదర్శులకు లేఖలు రాసింది. దీంతో ఇద్దరు కీచక అధికారులను సస్పెండ్ చేసి దర్యాప్తు చేపట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios