సీఆర్పీఎఫ్ జవాన్లు మరోసారి మానవత్వం చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ చిన్నారి ప్రాణాలను కాపాడారు. ఈ సంఘటన చత్తీస్ గఢ్ లో చోటుచేసుకుంది.  పూర్తి వివరాల్లోకి వెళితే... జూన్ 6వ తేదీన 231 బెటాలియన్ కి చెందిన కొందరు సీఆర్పీఎఫ్ జవాన్లు పెట్రోలింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో వారికి ఓ 13ఏళ్ల బాలుడు అనారోగ్యంతో కనిపించాడు.

గుమోడీ గ్రామానికిచెందిన 13ఏళ్ల బాలుడు జాండీస్ తో బాధపడుతున్నాడు. బాలుడి ఆరోగ్యం బాగా క్షిణించిన దశలో అతనిని సీఆర్పీఎఫ్ జవాన్లు చూశారు. వెంటనే అతనిని ఓ మంచం మీద కూర్చోపెట్టుకొని దానికి తాళ్లు కట్టి దాదాపు 8కిలోమీటర్ల పాటు నడిచారు. అనంతరం బాలుడు సుక్మా జిల్లాలోని కొండాసావ్లిలోని ఆర్మీ క్యాంప్ కి తరలించి అక్కడ మెరుగైన  చికిత్స అందించారు.

చికిత్స అనంతరం ప్రస్తుతం బాలుడు కోలుకుంటున్నాడు. కాగా.. బాలుడుని సీఆర్పీఎఫ్ జవాన్లు మోసుకువెళ్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆ జవాన్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.