భూమిని తాకిన భారీ సౌర తుఫాన్.. వినువీధిలో కనిపించిన అరోరా వెలుగులు.. వైరల్ వీడియో..

Ladakh's aurora: ఇటీవల భారీ సౌర తుఫాను భూమిని తాకడంతో లడఖ్‌లోని హన్లేపై అరోరా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లూక్కేయండి. 

Crimson glow of Ladakh aurora Giant telescope's May 10 time-lapse video reveals celestial spectacle KRJ

Ladakh's aurora: గత రెండు దశాబ్దాల నుంచి అత్యంత శక్తి వంతమైన సౌర తుఫానులు భూమిని తాకుతూనే ఉన్నాయి. ఈ పరిణామంతో భూ ఉపరితల ఉష్టోగ్రతల మార్పులతో పాటు ఆకాశవీధుల్లో ఖగోళ అద్బుతం కనువిందు చేస్తుంటాయి. ఈ అద్భుత కాంతి వలయాలకు అరోరా అని పేరు. ఇవి ఏర్పడే దిక్కును బట్టి అరోరా బొరియాలిస్‌ (ఉత్తర కాంతులు), అరోరా ఆస్ట్రలిస్‌ (దక్షిణ కాంతులు) అని పిలుస్తారు. ఇవి వివిధ రకాల రంగుల్లో మనకు దర్శమిస్తుంటాయి.  ఇటీవల సంభవించిన సూర్య తుఫాన్ వల్ల భారతదేశంలోనూ ఈ ఖగోళ అద్భుతాలు కనువిందు చేశాయి.  

ఇక్కడంటే..?

మే 11న అత్యంత శక్తిమంతమైన సౌర తుఫాన్‌ భూమిని తాకింది. గడిచిన ఆరేళ్లలో ఇంత బలమైన సౌర తుఫాన్‌ భూమిని తాకడం ఇదే తొలిసారి. ఈ పరిణామంతో రాత్రిపూట ఆకాశంలో అరోరా బొరియాలిస్‌ (ఉత్తర కాంతులు)కనువిందు చేశాయి. ఆ రాత్రి ఆకాశం రంగురంగులతో నిండిపోయింది. ప్రపంచంలోని అనేక ప్రాంతాలతో పాటు లడఖ్‌లోని హన్లే అనే గ్రామం అరోరా బొరియాలిస్‌ కనిపించాయి. లద్దాఖ్‌లో కనువిందు చేసిన అరోరా బొరియాలిస్‌ .. అత్యంత అరుదైన ఎరుపు రంగు కాంతులను విరజిమ్మాయి. ఇది అత్యంత మనోహరంగా ఉండటమే గాక చాలా సేపు వీను వీధుల్లో దర్శనమించింది. 

ఈ అద్భుత ఘట్టాన్ని లడఖ్‌లోని హన్లేలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసిన ఖగోళ పరిశీలన కేంద్రం పరిశీలించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను అత్యంత శక్తివంతమైన జెయింట్ టెలిస్కోప్ లో ఏర్పాటు చేసిన కెమెరా ద్వారా బంధించింది. ఇందుకు సంభవించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా హాన్లేలోని ఖగోళ అబ్జర్వేటరీ మరో అద్భుతమైన దృశ్యాన్ని విడుదల చేసింది. 

వీడియో చూడండి


అబ్జర్వేటరీ ప్రత్యేకత

లడఖ్‌లోని హన్లేలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసిన ఖగోళ పరిశీలన కేంద్రం సముద్ర మట్టానికి దాదాపు 15,000 అడుగుల (4500 మీ) ఎత్తులో ఉంటుంది. గ్రహాలు, ఇతర ఖగోళ అద్భుతాలను పరిశీలించడానికి ఇక్కడ  జెయింట్ టెలిస్కోప్ ను ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన టెలిస్కోప్‌లలో ఒకటి. ఆకాశంలోని అరుదైన దృశ్యాలను సంగ్రహిస్తుంటారు.   
 
సూర్యుని వాతావరణంలో ఏర్పడిన సౌర తుపాను మే 10న ప్రారంభమై మూడు పాటు ప్రభావం చూపిందని శాస్త్రవేత్తలు వివరించారు. దీని వల్ల భూమిపై దాదాపు 60 నుంచి 90 నిమిషాల పాటు ప్రభావం ఉందని,  ఈ నెలలో సంభవించిన రెండవ అతిపెద్ద సౌర తుఫానుగా ఇది రికార్డులకెక్కింది. అమెరికా, కెనడా, యూరప్‌, డెన్మార్క్, స్విట్జర్లాండ్, పోలండ్‌ తదితర దేశాల్లో అరోరాలు కనువిందు చేశాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios