ఢిల్లీ మెట్రో రైల్వేస్టేషన్‌లో ఓ జంట అశ్లీల కార్యకలాపాలకు పాల్పడటం .. అవి సీసీ కెమెరాలో రికార్డవ్వడం ఆ వెంటనే పోర్న్ సైట్‌లో ప్రత్యక్షం కావడం కలకం రేపింది. ఈ ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు.

రైల్వే కంట్రోల్ రూంలో భద్రత మధ్య ఉండాల్సిన సీసీ ఫుటేజీలు పోర్న్ సైట్‌లోకి ఎలా వచ్చాయంటూ ఫైర్ అవుతున్నారు. దీంతో ఢిల్లీ మెట్రో యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. మెట్రో రైల్వేకు సంబంధించిన వ్యక్తే  ఈ వీడియోని దొంగతనం చేసి పోర్న్‌సైట్‌లో పెట్టి వుంటాడని అధికారులు భావిస్తున్నారు.

ఆ ఉద్యోగి ఎవరో తెలుసుకుని అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ మెట్రో సీఈవో తెలిపారు. అదే విధంగా మెట్రో స్టేషన్ పరిసరాల్లో ఎవరూ ఇలాంటి పనులకు పాల్పడరాదంటూ ఆయన ప్రజలకు విజ్ఙప్తి చేశారు. ఇప్పటికే మెట్రోలో అసభ్య కార్యకలాపాలకు పాల్పడిన సదరు జంటపై ఆజాద్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.