తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కరోనా వైరస్ సోకిన యువతిని ఐసోలేషన్ కేంద్రానికి తీసుకుని వెళ్తూ మార్గం మధ్యలో అంబులెన్స్ డ్రైవర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను ఐసోలేషన్ కేంద్రంలో వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

ఆ ఘటన శనివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. తిరువనంతపురానికి 100 కిలోమీటర్ల దూరంలో ున్న పటనమిట్ట ప్రాంతంలో 19 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆమెను క్వారంటైన్ కు తరలించేందుకు బంధువులు అంబులెన్స్ కు కాల్ చేశారు. ఆమెను ఐసోలేషన్ కేంద్రానికి తీసుకుని వెళ్లేందుకు 108 అంబులెన్స్ డ్రైవర్ సౌఫాల్ (25) వచ్చాడు. 

అప్పటికే ఓ వృద్ధురాలిని కూడా క్వారంటైన్ కేంద్రానికి తీసుకుని వెళ్లాల్సి ఉంది. దాంతో ఇద్దరిని వేర్వేరు చోట్లకు తీసుకుని వెళ్లాల్సి రావడంతో తొలుత వృద్ధురాలిని ఓ అస్పత్రిలో వదిలిపెట్టి అక్కడి నుంచి యువతిని తీసుకుని పండాలమ్ ఆస్పత్రికి బయలుదేరాడు.

ఆస్పత్రికి తీసుకుని వెళ్లే మార్గంలో నౌఫాల్ అంబులెన్స్ ను ఓ నిర్మానుష్య ప్రదేశానకిి తీసుకుని వెళ్లి యువతిపై లైంగిక దాడి చేశాడు. ఆ తర్వత అర్థరాత్రి ఆమెను కోవిడ్ కేర్ సెంటర్ లో వదిలేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అరన్ములా పోలీసులు డ్రైవర్ ను అరెస్టు చేశారు.

ఆ సంఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కెకె శైలజ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డ్రైవర్ ను వెంటనే విధుల నుంచి తొలగించాలని 108 సర్వీస్ ను నిర్వహిస్తున్న జీవికె సంస్థకు సూచించారు.