Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ నన్ను రేప్ చేయాలనుకుంటున్నది: కర్ణాటక హోం మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

కర్ణాటకలోని మైసూరు దగ్గర జరిగిన గ్యాంగ్ రేప్‌ గురించి హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర మాట్లాడుతూ కాంగ్రెస్ నన్ను రేప్ చేయాలనుకుంటున్నదని అన్నారు. సీరియస్ ఘటనను ప్రస్తావిస్తూ ఇలా తేలికపాటి వ్యాఖ్యలు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బాధితులు చీకటయ్యేవరకు ఘటనాస్థలిలో ఉండాల్సింది కాదని హోం మంత్రి బాధితులనే తప్పుపట్టారు. ఈ వ్యాఖ్యలపై వ్యతిరేకత రావడంతో వెనక్కి తీసుకున్నారు.
 

congress trying to rape me says home minister while answering   mysuru rape case
Author
Mysore, First Published Aug 26, 2021, 7:33 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బెంగళూరు: కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర గురువారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మైసూరు రేప్ కేసు గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన చేసి వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. గ్యాంగ్ రేప్ మైసూరులో జరిగిందని, కానీ, కాంగ్రెస్ నన్ను రేప్ చేయాలనుకుంటున్నదని అన్నారు. రాష్ట్రమంతటా సంచలనాన్ని రేపిన లైంగికదాడి గురించి ప్రస్తావిస్తూ జోక్ చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

‘రేప్ మైసూరులో జరిగింది. కానీ, కాంగ్రెస్ హోం మంత్రిని రేప్ చేయాలనుకుంటున్నది. ఈ ఘటన ద్వారా వారు పొలిటికల్ మైలేజీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇది విచారకరం. ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకున్నప్పుడు మానవత్వంతో ఆలోచించి కేసు గురించి, నిందితులను పట్టుకోవడం గురించి మాట్లాడాలి. లేదా మళ్లీ ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా ఏం చర్యలు తీసుకోవాలో చర్చించాలి. కానీ, రాజకీయంగా లబ్ది పొందాలనుకోవడం దారుణం. ప్రజలు కాంగ్రెస్ వైఖరిని చూస్తున్నారు. వాళ్లే నిర్ణయిస్తారు’ అని హోం మంత్రి అన్నారు.

మైసూరు శివారులోని చాముండ హిల్స్ సమీపంలో 23ఏళ్ల ఎంబీఏ విద్యార్థినిపై కొందరు దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు. ఆమె బాయ్ ఫ్రెండ్‌ను చితక్కొట్టారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. ప్రస్తుతం బాధితులిద్దరు ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. 

ఈ ఘటనను తాము సీరియస్‌గా తీసుకున్నామని హోం మంత్రి చెప్పారు. కానీ, బాధితులు చీకటయ్యే వరకు అటవీప్రాంతంలో ఉండేది కాదని, సాయంత్రానికి వెనుదిరగాల్సిందని బాధితులను తప్పుపట్టారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తీసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios