ఎప్పుడు వార్తల్లో ఉండే నాయకుడు శత్రుగన్ సిన్హా తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆయన పాకిస్తాన్ అధ్యక్షుడితో లాహోర్ లో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సరిహద్దుల వెంట శాంతి వారధులను నెలకొల్పాల్సిన అవసరం ఉందని, శాంతి నెలకొల్పడం గురించి సిన్హా తో చర్చించినట్టు పాక్ అధ్యక్షుడు ట్విట్టర్ ద్వారా తెలిపారు. 

ఒక పెళ్లి వేడుకలో పాలుపంచుకునేందుకు పాకిస్తాన్ కి వెళ్లిన సిన్హా ఆ ఈవెంట్ తరువాత లాహోర్ లో పాక్ అధ్యక్షుడితో సమావేశమయ్యారు. శాంతిని నెలకొల్పడం నుంచి కాశ్మీర్ వరకు అనేక విషయాలు వీరిరువురి మధ్య చర్చకొచ్చినట్టు మీడియాకు ఆరిఫ్  కార్యాలయం తెలిపింది. 

ఇరువురు కూడా ఉపఖండంలో శాంతిని నెలకొల్పడం ఎందుకు అవసరమో నొక్కిచెబుతూ... దానికి ఎం చేయాలనుకుంటున్నారో కూడా చర్చించారని ఆ ప్రకటనలో పాక్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. 

చాలా విషయాల గురించి చర్చించామని, సామాజిక పరిస్థితుల నుంచి సాంస్కృతిక అంశాలవరకు అనేక విషయాలు తమ మధ్య చర్చకు వచ్చాయని సిన్హా ట్విట్టర్ వేదికగా తెలిపాడు. పాక్ అధ్యక్షుడితో జరిగిన సంభాషణ గురించి కొన్ని వరుస ట్వీట్లలో అనేక ఆసక్తికర విషయాలను తెలిపాడు సిన్హా. 

విదేశీ గడ్డపై ఉన్నప్పుడు రాజకీయాల గురించి మాట్లాడే స్థానంలో లేనప్పుడు రాజకీయ అంశాల గురించి మాట్లాడబోనని, తనకు ఆ విషయం తెలుసుననై, అందువల్లే రాజకీయాల గురించి తమ మధ్య ఎటువంటి చర్చ జరగలేదని తెలిపారు శత్రుఘన్ సిన్హా. 

ఈ సమావేశానికి వెళ్లే ముందు... ఇలా పాకిస్తాన్ పర్యటనకు రావడం తన వ్యక్తిగతమని అంటూ ఒక ట్వీట్ చేసారు. పాకిస్తాన్ ఫిలిం మేకర్ మియాన్ ఎహసాన్ మనవడి వివాహ వేడుకకు హాజరయ్యేందుకు మాత్రమే పాకిస్తాన్ వెళ్లినట్టు శత్రుఘన్ సిన్హా తెలిపారు.