వెనక్కి తగ్గిన బిజెపి: స్పీకర్ గా రమేష్ కుమార్ ఏకగ్రీవం

Congress and JDS MLAs reach Vidhan Soudha
Highlights

కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్షకు సిద్ధపడుతున్న నేపథ్యంలో కాంగ్రెసు, జెడిఎస్ శాసనసభ్యులు విధాన సౌధకు చేరుకున్నారు.

బెంగళూరు: స్పీకర్ పదవికి కాంగ్రెసు, జెడిఎస్ కూటమి తరఫున రమేష్ కుమార్ పేరును సిద్ధరామయ్య ప్రతిపాదించారు. స్పీకర్ పదవికి పోటీ పెట్టాలనే నిర్ణయం నుంచి బిజెపి వెనక్కి తగ్గింది. దీంతో రమేష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనను ముఖ్యమంత్రి కుమారస్వామితో పాటు సిద్ధరామయ్య, తదితరులు అబినందించారు. బోపయ్య స్పీకర్ కుర్చీ నుంచి దిగి బోపయ్యను ఆ స్థానంలో కూర్చోబెట్టారు.

కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్షకు సిద్ధపడుతున్న నేపథ్యంలో కాంగ్రెసు, జెడిఎస్ శాసనసభ్యులు విధాన సౌధకు చేరుకున్నారు. వారు రిసార్ట్ నుంచి నేరుగా విధాన సౌధకు వచ్చారు. ఈ రెండు పార్టీల ఎమ్మెల్యేల సమావేశానికి కాంగ్రెసు నాయకుడు శివకుమార్ హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఆయన ఉప ముఖ్యమంత్రి పదవిని ఆశించి భంగపడడంతో అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కాగా, స్పీకర్ పదవికి తమ అభ్యర్థిని పోటీకి దించాలని బిజెపి నిర్ణయించింది. సురేష్ కుమార్ ను తమ అభ్యర్థిగా ఖరారు చేసింది.

కాంగ్రెసు ఎమ్మెల్యే రమేష్ కుమార్ సంకీర్ణ కూటమి తరఫున స్పీకర్ పదవికి పోటీ పడుతున్నారు. స్పీకర్ ఎన్నికతోనే కుమారస్వామి భవిష్యత్తు తేలిపోతుంది. 

స్పీకర్ ఎన్నికను ప్రోటెమ్ స్పీకర్ బోపయ్య చేపట్టనున్నారు. బోపయ్య బిజెపికి చెందిన ఎమ్మెల్యే అనే విషయం తెలిసిందే. అన్ని పార్టీలు కూడా తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశాయి. 

శివకుమార్ అసంతృప్తితో ఉన్నారనే వార్తలను వేణుగోపాల్ ఖండించారు. ఆయన పార్టీ పనుల్లో బిజీగా ఉన్నారని చెప్పారు. 

loader