న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కు ఐటీ నోటీసులు జారీ చేసింది.రూ. 400 కోట్లు హవాలా రూపంలో వచ్చిన సొమ్ము విషయమై అహ్మద్ పటేల్ కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది.  ఐటీ శాఖ ముందు  అహ్మద్ పటేల్ హాజరు కాలేదు. మూడు రోజుల్లో తమ ముందు హాజరు కావాలని ఐటీ శాఖ అహ్మద్ పటేల్ ను కోరింది.

హవాల రూపంలో డబ్బు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కు చేరినట్టుగా ఐటీ శాఖ అనుమానిస్తోంది.హవాలా రూపంలో సుమారు రూ. 400 కోట్లు అహ్మద్ పటేల్ కు అందినట్టుగా  అధికారులు గుర్తించారు.

Also read:బాబు మాజీ పీఎస్ పై ఐటీ దాడులు: అహ్మద్ పటేల్ కు లింక్ పెట్టిన విజయసాయి

ఈ విషయమై వివరణ ఇవ్వాలని ఈ నెల 11వ తేదీన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌కు  ఐటీ శాఖాధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 14వ తేదీన  హాజరు కావాలని   కోరారు 

అయితే తాను అనారోగ్యంగా ఉన్నందున  హాజరు కాలేనని అహ్మద్ పటేల్ ఐటీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. మరో సారి తమ ముందు హాజరుకావాలని  కూడ ఐటీ శాఖాధికారులు మరో నోటీసును పంపారు.

మూడు రోజుల్లోపుగా తమ ముందు హాజరుకావాలని ఐటీ శాఖాధికారులు అహ్మద్ పటేల్‌కు రెండోసారి నోటీసును కూడ పంపినట్టుగా సమాచారం. అయితే  అహ్మద్ పటేల్ మాత్రం ఐటీ శాఖాధికారుల ముందు హాజరుకాలేదని తెలుస్తోంది. 

 తెలుగు రాష్ట్రాల్లో ఐటీ శాఖాధికారులు జరిపిన సోదాలు నిర్వహించారు. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ తో పాటు టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి ఇంట్లో కూడ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. 

ఇదిలా ఉంటే చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో ఐటీ సోదాలను కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌కు విజయసాయిరెడ్డి లింకు పెట్టారు.ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు.