బాత్రూంలో స్నానం చేస్తుంటే వీడియో తీసి.. తన ప్రియుడికి పంపించిందో ప్రియురాలు. దారుణమైన ఈ ఘటన బెంగుళూరులోని ఓ నర్సింగ్ హాస్టల్ లో జరిగింది. తోటి మహిళ, సహోద్యోగి అని కూడా చూడకుండా అలాంటి వీడియో తీసిన నర్సును పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెడినే... బెంగళూరు వైట్ ఫీల్డ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి హాస్టల్ లో సహ ఉద్యోగిని బాత్‌రూమ్‌లో స్నానం చేస్తున్న దృశ్యాలను వీడియో తీసి ప్రియుడికి అప్‌లోడ్‌ చేసింది ఓ నర్సు. హాస్టల్‌ ఇన్‌చార్జ్‌ ఫిర్యాదు మేరకు ఆదివారం వైట్‌ఫీల్డ్‌ పోలీసులు నర్సు అశ్వినినీ అరెస్ట్‌ చేశారు. 

ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు. వైట్‌ఫీల్డ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అశ్విని నర్సుగా పనిచేస్తోంది.అత్యవసర సేవల విభాగంలోని నర్సులకు హాస్టల్‌ వసతి కల్పించారు. ఈనెల 5న సాయంత్రం ఓ నర్సు తన గదిలో స్నానం చేస్తుండగా బాత్‌రూమ్‌లో మొబైల్‌ కనిపించింది. 

దీంతో భయపడిన సదరు నర్సు దాన్ని పరిశీలించగా వీడియో రికార్డు అయినట్లు గుర్తించి హాస్టల్‌ ఇన్‌చార్జ్‌కు ఫిర్యాదు చేసింది. ఫోన్‌ అశ్వినిది కావడంతో ఆమెను విచారించడంతో అసలు విషయం బయటపడింది. కేసు దర్యాప్తులో ఉంది.