డ్రగ్స్ ఇచ్చి విద్యార్థితో సీనియర్ల అసహజ లైంగిక క్రీడ

First Published 2, Aug 2018, 7:05 PM IST
Class 11 student sodomised at Ajmer
Highlights

పాఠశాలలో ఆరుగురు సీనియర్ విద్యార్థులు డ్రగ్స్ ఇచ్చి 11వ తరగతి విద్యార్థితో అసహజ లైంగిక క్రీడ జరిపిన వైనం చోటు చేసుకుంది. సంబంధిత చట్టం కింద అజ్మీర్ పోలీసులు కేసు నమోదు చేశారు. 

అజ్మీర్: పాఠశాలలో ఆరుగురు సీనియర్ విద్యార్థులు డ్రగ్స్ ఇచ్చి 11వ తరగతి విద్యార్థితో అసహజ లైంగిక క్రీడ జరిపిన వైనం చోటు చేసుకుంది. సంబంధిత చట్టం కింద అజ్మీర్ పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఈ సంఘటన రాజస్థాన్ లోని ప్రముఖమైన విద్యాసంస్థల్లో ఒక్కటైన మయో కాలేజీలో చోటు చేసుకుంది. పాఠశాలలో జరుగుతున్న సంఘటనల పట్ల తీవ్ర అసంతృప్తికి గురైన బాలుడు బోర్డింగ్ స్కూలును వదిలేసి ఇంటికి చేరుకున్నాడు. 

బాధితుడు తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పారు. దీంతో వారు పాఠశాల యాజమాన్యానికి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కూలు ప్రిన్సిపాల్ సమీక్ష జరిపి ఎఎఫ్ఆర్ ను సమర్థించారు. 

బాధితుడిపై జూన్ 10, 20 తేదీల మధ్య పలుమార్లు లైంగిక దాడికి తెగబడ్డారు. అతనితో బలవంతంగా మద్యం తాగించారు. మాంసాహారం తినిపించారు. 

సీనియర్ విద్యార్థులు బాదితుడి గదిలోకి జూన్ 10వ తేదీన బలవంతంగా చొరబడి ఆల్కహాల్ తాగించారు. డ్రగ్స్ తీసుకునేలా చేశారు. ఆ తర్వాత అతన్ని వాష్ రూంలోకి తీసుకుని వెళ్లి అతనిపై లైంగిక దాడి చేశారు. నిందితులపై పాఠశాల ఏ విధమైన చర్యలు కూడా తీసుకోలేదు. ఈ సంఘటనపై మాట్లాడేందుకు ప్రిన్సిపాల్ నిరాకరించారు. 

loader