Asianet News TeluguAsianet News Telugu

భారత్, చైనా సరిహద్దులో మరోసారి ఉద్రిక్తతలు.. సైనికుల మధ్య ఘర్షణ!

చైనా ఆర్మీ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. సరిహద్దు దాటి అరుణాచల్ ప్రదేశ్‌లోకి ఎంటర్ అయింది. భారత సైన్యం అప్పుడే అక్కడికి చేరడంతో ఉభయ దేశాల సైనికుల మధ్య చిన్నపాటి ఘర్షణలు జరిగాయి. పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కానీ, భారత సైన్యం గట్టిగా ప్రతిఘటించడంతో డ్రాగన్ ఆర్మీ తోకముడించింది. ఇందులో స్థానిక కమాండర్ అధికారులు కీలకపాత్ర పోషించారు.
 

china PLA entered into arunachal pradesh led to army face off
Author
New Delhi, First Published Oct 8, 2021, 1:40 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: డ్రాగన్ కంట్రీ china మరోసారి కవ్వింపు చర్యకు పాల్పడింది. గతేడాది ladakhలో indian armyతో హింసాత్మక ఘర్షణలకు పాల్పడింది. ఈ సారి చైనా సైన్యం border దాటి అరుణాచల్ ప్రదేశ్‌‌లోకి చొచ్చుకువచ్చారు. గతవారం ఈ ఘటన జరిగినట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి. తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్తే ఏరియాలో డ్రాగన్ సేనలు భారత భూభాగంలోకి వచ్చాయని వివరించాయి. అదే సమయంలో భారత సైనికులూ ప్యాట్రోలింగ్ చేస్తూ అక్కడికే చేరుకున్నారు. దీంతో ఉభయ దేశాల సైన్యం ఎదురుబడ్డాయి. ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరించాయి. ఒకరినొకరు నెట్టుకున్నట్టు తెలిసింది. కొన్ని గంటలపాటు అక్కడ ఉద్రికత్తలు నెలకొన్నాయి. అనంతరం డ్రాగన్ సైన్యం తోకముడిచి వెనక్కి వెళ్లినట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ఉత్తరాఖండ్‌లోకి చైనా ఆర్మీ ఇలాగే చొరబడింది. తర్వాత తీరిగ్గా వెళ్లిపోయింది.

భారత సైనికులు యాంగ్తే ప్రాంతంలో patrolling చేస్తున్న సమయంలోనూ చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కూడా వచ్చి చేరింది. ఒకే ప్రాంతంలో ఇరు దేశాల సైన్యాలు ప్యాట్రోలింగ్ చేయడం ఉద్రికత్తలకు దారి తీసింది. చైనా సైన్యం వందల సంఖ్యలో ఉన్నట్టు తెలిసింది. కానీ, మనదేశ జవాన్లు గట్టిగా ప్రతిఘటించడంతో చైనా ఆర్మీ వెనుదిరిగింది. ఇక్కడ వాస్తవాధీన రేఖపై ఉభయ దేశాలకు స్పష్టత లేదని ఆర్మీవర్గాలు తెలిపాయి. బార్డర్ పై ఉభయ దేశాల అభిప్రాయాల్లో తేడా ఉన్నదని వివరించాయి. అందుకే అలాంటి కొన్ని అస్పష్టత ఉన్న ప్రాంతాల్లో ఉభయ దేశాల సైనికులు ప్యాట్రోలింగ్ చేస్తుంటారని పేర్కొన్నాయి. ఒక్కోసారి ఇలా రెండు దేశాల సైన్యాలు ఎదురుపడ్డప్పుడు ఉద్రిక్తతలు ఏర్పడుతాయని వివరించాయి. ఈ అంశంపై ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాలకు అనుగుణంగా ఉద్రిక్తతలను పరిష్కరించుకుంటాయని తెలిపాయి. తాజాగా తవాంగ్‌లో చోటుచేసుకున్న ఉద్రిక్తతలనూ స్థానిక కమాండర్ అధికారులు పరిష్కరించడంతో ఘర్షణలు తీవ్రరూపం దాల్చకుండా ముగిసిపోయాయి.

గతేడాది ఈస్ట్రన్ లడాఖ్‌లో ఉభయ దేశాల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాటిని తొలగించుకోవడానికి రెండు దేశాల పలుమార్గాల్లో శాంతి చర్చలు జరుపుతున్నాయి. ఇందులో భాగంగానే 13వ రౌండ్ కార్ప్స్ కమాండర్ స్థాయి చర్రచలు త్వరలో జరగనున్నాయి. ఈ చర్చలకు ముందే తవాంగ్ సెక్టార్‌లో ఉద్రిక్తతలు ఏర్పడటం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios