భోపాల్:మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 11 ఏళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి  మూడు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

బుందేల్‌ఖండ్‌లోని చత్తాపూర్ జిల్లాకు చెందిన మద్యానికి అలవాటుపడిన  ఓ వ్యక్తి తన కూతురిని ఓ వ్యక్తికి విక్రయించాడు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. తన తండ్రి ఈ ఏడాది మే 12వ తేదీన దేవి భాస్కర్ అనే వ్యక్తికి రూ. 50వేలకు విక్రయించారని చెప్పింది. అదే రోజున దేవి భాస్కర్ తనను  ఓ దేవాలయంలోకి తీసుకెళ్లి  చీర కట్టించి...   మెడలో మంగళసూత్రం కట్టారని బాధితురాలు తెలిపింది.

ఆ తర్వాత తనను భాస్కర్  తన ఇంటికి తీసుకెళ్లి వరుసగా మూడు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడినట్టుగా బాధితురాలు తెలిపింది. తాను చాలా గాయపడినట్టుగా బాధితురాలు తెలిపింది.భాస్కర్ కుటుంబసభ్యుల వాదన మరోలా ఉంది. చిన్నారి ఏడుస్తోందని ఆరోపిస్తూ తండ్రికి ఆ బాలికను అప్పగించారు.

బాలిక తల్లికి తండ్రికి మధ్య విబేధాలు ఉన్నాయి.  ఈ కారణంగానే బాలిక తల్లి సాగర్  జిల్లాలో భర్తకు దూరంగా నివాసం ఉంటుంది.ఈ విషయం తెలుసుకొన్న తల్లి కూతురితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అయితే తన భర్తతో పాటు ఆయన సోదరి కలిసి తన కూతురిని ఓ వ్యక్తికి విక్రయించినట్టుగా చిన్నారి తల్లి ఆరోపిస్తోంది. చిన్నారి కంటే మూడు రెట్ల వయస్సు ఎక్కువ వ్యక్తికి విక్రయించారని బాధితురాలు చెప్పారు.చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిపై  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.