కామంతో కళ్లు మూసుకుపోయి ఓ యువకుడు కుక్కపై అత్యాచారానికి పాల్పడ్డాడు.  ఈ దారుణ సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నందనం ప్రాంతంలోని ఓ టీ స్టాల్ లో పనిచేస్తున్న నిందితుడు ఆదివారం రాత్రి పీకల దాకా మద్యం సేవించాడు. ఆ మద్యం మత్తులో వీధి కుక్కపై అత్యాచారానికి పాల్పడ్డాడు.  విషయం తెలుసుకున్న స్థానికులు అతనిని అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు. కాగా.. అతను అక్కడి నుంచి కదలకపోగా.. కుక్కను వదిలిపెట్టలేదు.

దీంతో.. కుక్కతో అతని వీడియోలను తీసి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీశారు. ఆ కుక్కను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.