Asianet News TeluguAsianet News Telugu

రూ.22కే ఉల్లి ఇస్తామంటూ బంపర్ ఆఫర్.. బాబోయ్ మాకొద్దంటున్న ప్రజలు

విదేశీ ఉల్లి ధర కిలో రూ.55 వరకు ఉండటం ఒకటైతే.. అదే ధరకు దేశీయ ఉల్లి కూడా లభిస్తుండటంతో విముఖత చూపాయి. అంతేకాకుండా విదేశీ ఉల్లి తినడానికి అంత రుచికరంగా లేదని వారు వాదిస్తున్నారు. ఉల్లి అలా అమ్ముడు కాకుండా ఉండిపోయానని దాని ధరను అమాంతం తగ్గించారు. 

Centre Offers Onions at Rs 22 Per kg to States
Author
Hyderabad, First Published Jan 16, 2020, 11:41 AM IST

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉల్లికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. నిన్న మొన్నటి వరకు కేజీ ఉల్లి ధర రూ.200చిలుకు పలికింది. ఇప్పుడు కాస్త ధరలు తగ్గినా... సామాన్య ప్రజలకు అందుబాటు ధరలోకైతే రాలేదు. వర్షాలు ఎక్కువగా పడటంతో.. ఉల్లి పంటలు నీటమునిగాయి. అందుకే ధర అంతలా ఆకాశాన్నంటింది. దీంతో... సామాన్యులు ఉల్లి కొనలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో... ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరుగా సబ్సీడీ ప్రకటించి.. ఉల్లికోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు.

Also Read కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మ ముద్రించాలి: సుబ్రమణ్యస్వామి

అయితే... ఉల్లి ధర మాత్రం ఎన్నిరోజులకీ డిమాండ్ తగ్గలేదు. దీంతో కేంద్రం విదేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంది. టర్కీ, ఆఫ్ఘానిస్తాన్, ఈజిప్టు తదితర దేశాల నుంచి 18వేల టన్నుల ఉల్లి వచ్చింది. అయితే ఇప్పటి వరకు కేవలం 2వేల టన్నులు మాత్రమే ప్రజలు కొనుగోలు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలు దిగుమతి ఉల్లిని తీసుకోగా... మిగితా రాష్ట్రాలు మాత్రం విదేశీ ఉల్లిని తీసుకోవడానికి అంగీకరించలేదు.

దీనికి కారణం.. విదేశీ ఉల్లి ధర కిలో రూ.55 వరకు ఉండటం ఒకటైతే.. అదే ధరకు దేశీయ ఉల్లి కూడా లభిస్తుండటంతో విముఖత చూపాయి. అంతేకాకుండా విదేశీ ఉల్లి తినడానికి అంత రుచికరంగా లేదని వారు వాదిస్తున్నారు. ఉల్లి అలా అమ్ముడు కాకుండా ఉండిపోయానని దాని ధరను అమాంతం తగ్గించారు. కేవలం కేజీ ఉల్లి రూ.22 కే ఇస్తామన బంపర్ ఆపర్ కూడా ఇచ్చారు. 

అయినా కూడా ప్రజలు కొనడానికి ఆసక్తి చూపించకపోవడం గమనార్హం. దీంతో.. కుప్పలుగా పడి ఉన్న ఉల్లిలో 90శాతం కుళ్లిపోతుండటం గమనార్హం. 

Follow Us:
Download App:
  • android
  • ios