Asianet News TeluguAsianet News Telugu

దేశవ్యాప్తంగా క్వాలిటీ చెక్‌లో ఫెయిలైన 70 ఔషధాలు .. లిస్ట్‌లో దగ్గు, షుగర్, బీపీ మెడిసిన్స్

సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో) ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లోని 25 ఫార్మాస్యూటికల్ పరిశ్రమలలో తయారు చేసిన 40 మందులు, ఇంజెక్షన్లు నాణ్యత లేనివిగా గుర్తించింది.

CDSCO : Samples of 70 Medicines, Including BP, Cough, Diabetes, Fail Quality Checks Across India ksp
Author
First Published Jan 24, 2024, 9:47 PM IST | Last Updated Jan 24, 2024, 9:50 PM IST

భారతదేశంలో ఔషధాలు, సౌందర్య సాధనాల నాణ్యతను నియంత్రించే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో) ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లోని 25 ఫార్మాస్యూటికల్ పరిశ్రమలలో తయారు చేసిన 40 మందులు, ఇంజెక్షన్లు నాణ్యత లేనివిగా గుర్తించింది. కంపెనీలు ఉత్పత్తి చేసే ఔషధాలు అవసరమైన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వున్నాయా లేదా అనేది నిర్ధారించుకోవడానికి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ వుంటుంది. 

తాజా సోదాల్లో డ్రగ్స్ అనుకున్న దానికంటే తక్కువ స్థాయిలో క్రియాశీల పదార్ధాలను కలిగి వున్నట్లు , వినియోగదారులకు హాని కలిగించే మలినాలను కలిగి వున్నట్లు కనుగొన్నారు. ఆస్తమా, జ్వరం, మధుమేహం, రక్తపోటు, అలర్జీలు, మూర్చ, దగ్గు, యాంటీబయాటిక్స్, బ్రోన్కైటీస్ , గ్యాస్ట్రిక్ వంటి పలు సాధారణ వైద్య పరిస్థితులకు సంబంధించిన మందులు నాణ్యత లేనివిగా గుర్తించబడ్గాయి. దీనికి అదనంగా కాల్షియం సప్లిమెంట్లు సహా మల్టీ విటమిన్లు కూడా నాణ్యత లేనివిగా గుర్తించబడ్డాయి. 

నాసిరకం మందులను ఉత్పత్తి చేసిన ఫార్మాస్యూటికల్ పరిశ్రమలపై సీడీఎస్‌సీవో చర్యలు తీసుకుంది. అలాగే సదరు డ్రగ్స్‌ను వెంటనే వెనక్కి రప్పించాలని, వాటి ఉత్పత్తుల నాణ్యత.. ప్రమాణాలకు అనుగుణంగా వుండేలా చర్యలు తీసుకోవాలని సీడీఎస్‌సీవో ఆదేశించింది. వాస్తవానికి డిసెంబర్ నెలలో సీడీఎస్‌ఈవో (సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్) ఈ సమస్యపై అలర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా.. ఉత్తరాఖండ్, పంజాబ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ముంబై, తెలంగాణ , ఢిల్లీలోని ఫార్మాస్యూటికల్ పరిశ్రమలలో తయారు చేయబడిన 38 వేర్వేరు మందుల నమూనాలు కూడా విఫలమయ్యాయి. 

రక్తం గడ్డకట్టే చికిత్సలో ఉపయోగించే హెపారిన్ సోడియం ఇంజెక్షన్ ఎనిమిది నమూనాలు, బడ్డీలోని అలయన్స్ బయోటెక్ తయారు చేసిన వివిధ బ్యాచ్‌లు కూడా విఫలమయ్యాయి. అలాగే జర్మజ్రీలోని కన్హా బయోటెక్నిక్ తయారు చేసిన విటమిన్ డీ3 టాబ్లెట్ల ఐదు నమూనాలు కూడా అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా లేవు. డ్రగ్ అలర్ట్‌లో చేర్చబడిన 25 ఫార్మాస్యూటికల్ కంపెనీలలో పలు కంపెనీలు తమ ఔషధ నమూనాల తనిఖీలో పదే పదే వైఫల్యాలను ఎదుర్కొన్నాయి. అంతేకాదు.. హిమాచల్ ప్రదేశ్‌లో డ్రగ్స్ శాంపిల్స్ ఫెయిల్ అవుతూనే వున్నాయి. సీడీఎస్‌ఈవో జారీ చేసిన డ్రగ్ అలర్ట్ ప్రకారం, నాసిరకం మందులో 50 శాతం పైగా హిమాచల్ ఫార్మాస్యూటికల్ కంపెనీలలో తయారవుతున్నాయట. 

గతేడాది డిసెంబరులో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 1008 ఔషధాల నమూనాలను సేకరించగా, వాటిలో 78 మందులు నాసిరకంగా ఉన్నాయని తనిఖీలో గుర్తించగా, 930 మందులు అవసరమైన నాణ్యతా ప్రమాణాలను కలిగి ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, రిషికేశ్, ఘజియాబాద్, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, ముంబై, ఘజియాబాద్, అహ్మదాబాద్, హైదరాబాద్, డ్రగ్ డిపార్ట్‌మెంట్ నుండి ఈ డ్రగ్ శాంపిల్స్‌ను తనిఖీ కోసం సేకరించారు.

సీడీఎల్ (సెంట్రల్ డ్రగ్ లేబొరేటరీ)లో పరీక్ష నిర్వహించి, తనిఖీ నివేదికను మంగళవారం ప్రకటించారు. డ్రగ్ అలర్ట్‌లో పొందుపరిచిన అన్ని సంబంధిత ఫార్మాస్యూటికల్ కంపెనీలకు నోటీసులు జారీ చేసినట్లు డిప్యూటీ డ్రగ్ కంట్రోలర్ మనీష్ కపూర్ తెలియజేసారు. ఇంకా.. సంబంధిత బ్యాచ్‌ల మొత్తం స్టాక్‌ను రీకాల్ చేయాలని ఆదేశాలు ఇవ్వబడ్డాయి. దీనికి అదనంగా.. నమూనాలు పదేపదే విఫలమవుతున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కాన్హా బయోటెక్నిక్‌కు చెందిన రెండు యూనిట్లు ఉత్పత్తిని నిలిపివేసేందుకు ఆదేశించిన ఒక నెల తర్వాత మూసివేయబడ్డాయి.

డిసెంబర్‌లో డ్రగ్ అలర్ట్‌లో పేర్కొన్న ఔషధాల జాబితా :

  • మాంటెలుకాస్ట్ సోడియం , లెవోసెటిరిజైన్ డైహైడ్రోక్లోరైడ్ టాబ్లెట్
  • టెల్మిసార్టన్ టాబ్లెట్
  • ప్రీగాబాలిన్ టాబ్లెట్
  • సైప్రోహెప్టాడిన్ హెచ్‌సిఎల్ , ట్రైకోలినిక్ సిట్రేట్ సిరప్
  • సోడియం వాల్‌ప్రోయేట్ టాబ్లెట్
  • యాంపిసిలిన్ క్యాప్సూల్
  • అమోక్సిసిలిన్ ట్రైహైడ్రేట్ క్యాప్సూల్
  • ఆస్కార్బిక్ యాసిడ్ + జింక్ క్యాప్సూల్
  • ట్రిప్సిన్, బ్రోమెలైన్ , రుటిన్ ట్రైహైడ్రేట్ టాబ్లెట్
  • బ్రోమ్హెక్సోల్ హైడ్రోక్లోరైడ్, టెర్బుటలిన్ సల్ఫేట్, గుయిఫెనెసిన్ , మెంథాల్ సిరప్
     
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios