న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో నలుగురు అగ్రవర్ణాలకు చెందిన వారిపై సీబీఐ శుక్రవారం నాడు ఛార్జీషీట్ దాఖలు చేసింది. దళిత యువతిపై గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశారని సీబీఐ చార్జీషీట్ లో పేర్కొంది. ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు మాత్రం ఆ యువతిపై అత్యాచారం జరగలేదని ప్రకటించిన విషయం తెలిసిందే.బాధితురాలిపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ప్రకటించింది.  రేప్ తర్వాత ఆమెను హత్య చేశారని చార్జీషీట్ లో పేర్కొంది.

also read:హత్రాస్ కేసు: సీబీఐ విచారణపై సుప్రీం కీలక ఆదేశాలు

నిందితులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద సెక్షన్ 376 సెక్షన్ డి కింద నమోదైంది. 19 ఏళ్ల దళిత యువతి ఈ ఏడాది సెప్టెంబర్ 14న నలుగురు అత్యాచారం చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. తీవ్రంగా గాయపడిన ఆమె ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

ఆమె అంత్యక్రియలను రాత్రిపూట నిర్వహించారని బాధిత కుటుంబం ఆరోపించారు.కనీసం చివరి చూపు కూడ చూడకుండా  పోలీసులు అడ్డుకొన్నారని అప్పట్లో ఆ కుటుంబం ఆరోపణలు చేసింది. స్థానిక అధికారులు, పోలీసుల ఆదేశానుసారంగా అంత్యక్రియలు నిర్వహించారని ఆ కుటుంబం ఆరోపించింది.

ఈ ఘటనపై యోగి సర్కార్ పై విమర్శలు రావడంతో  యువతి మరణంపై దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. ఘజియాబాద్ కు చెందిన సీబీఐ బృందం ఈ కేసును విచారిస్తోంది. బాధిత కుటుంబం నుండి వాంగ్మూలాలను  సేకరించింది.