రేప్ కేసు: నా తప్పు లేదన్నాడు.. పారిపోయాడు..

Case rape accused Daati Maharaj now in under Ground
Highlights

రేప్ కేసు: నా తప్పు లేదన్నాడు.. పారిపోయాడు..

తానే  స్వయంగా దేవుడి అవతారం అని చెప్పుకునే దాతి మహారాజ్‌పై రేప్ కేసు నమోదైన సంగతి తెలిసిందే..దీనిపై నమోదైన కేసులో భాగంగా ఆయన ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరవ్వాల్సి ఉంది.. కానీ మహారాజ్ జాడ ఇంత వరకు లేదు.. ఆయన  కోసం వేచి చూసి చూసి.. ఎంతకు కార్యాలయానికి రాకపోవడంతో.. పోలీసులు రాజస్థాన్‌లోని పాలి ఆశ్రమంలోనూ.. ఢిల్లీ ఆశ్రమంలోనూ వెతికారు.. ప్రస్తుతం బాబాజీ గుర్తు తెలియని ప్రాంతానికి పారిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. దీంతో దాతి మహారాజ్‌పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

జరుగుతున్న సంఘటనల పట్ల సహనంతో ఉండాలని.. తాను ఏ నేరం చేయలేదని.. నేను నిజంగా తప్పు చేశానని రుజువైతే శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయన్నారు.. భారత న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని.. పోలీసుల విచారణకు సహకరిస్తానని కొద్దిరోజుల క్రితం శిష్యులను ఉద్దేశిస్తూ ఒక వీడియో సందేశంలో తెలిపాడు.. కాగా, మహారాజ్ ఆశ్రమం శనిధామ్‌లో దాతి చేతిలో తాను అత్యాచారానికి గురైనట్లు ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం కలిగించింది. దీంతో స్వామిజీపై కేసు నమోదైంది.

loader