హోమో సెక్స్.. బాలుడు మృతి

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 10, Aug 2018, 12:42 PM IST
bus conductor threaten and involved a student in homosexual and killed in tamilnadu
Highlights

రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులకు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు తెలిశాయి.
 

హోమో సెక్స్( స్వలింగ సంపర్కం) కారణంగా 8వ తరగతి చదివే ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.  దీనికి బాధ్యుడైన కండక్టర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కరూర్‌ జిల్లా క.పరమత్తి సమీపంలో ఉన్న విసువనాథపురికి చెందిన విశ్వనాథన్‌ కుమారుడు చిరంజీవి (13). ఇతను అదే ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన చిరంజీవి సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదు.

కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులకు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు తెలిశాయి.

లీసుల విచారణలో చిరంజీవిని విశ్వనాథపురి సలైవైక్కల్‌ వీధికి చెందిన ప్రైవేట్‌ మినీ బస్సు కండక్టర్‌ ప్రదీప్‌ (19) మంగళవారం సాయంత్రం తీసుకుని వెళ్లినట్లుగా స్థానికులు తెలిపారు. అనంతరం ప్రదీప్‌ను పట్టుకుని పోలీసులు విచారణ చేయగా దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటకు వచ్చాయి. 

పాఠశాల ముగిసి ఇంటికి వెళుతున్న చిరంజీవిని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అతన్ని బెదిరించి స్వలింగ సంపర్కానికి పాల్పడ్డాడు. భయపడిన చిరంజీవి విషయాన్ని తల్లిదండ్రులకు చెపుతానని తెలిపాడు. దీంతో ఆగ్రహం చెందిన ప్రదీప్‌ చొక్కాతో నోరు, ముక్కు గట్టిగా నులిమి పట్టుకున్నాడు. ఊపిరి ఆడక చిరంజీవి సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. పోలీసులు ప్రదీప్‌ను అరెస్టు చేశారు.  బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

loader