Asianet News TeluguAsianet News Telugu

పీకలదాకా తాగి.. తుపాకీ చేత పట్టి.. మహిళ హల్ చల్

ఆ షాపు యజమానిని బూతులు తిడుతూ.. గాలిలోకి తుపాకీతో కాల్పులు జరిపింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Burqa clad woman fires bullets, hurls abuses at Delhi shop owner as kids watch in horror, video goes viral
Author
Hyderabad, First Published Nov 24, 2020, 4:30 PM IST

ఓ మహిళ పీకలదాకా మద్యం సేవించి.. చేతిలో తుపాకీ పట్టుకొని నానా హంగామా చేసింది. ఓ దుకాణం ముందు నిలపడి.. ఆ షాపు యజమానిని బూతులు తిడుతూ.. గాలిలోకి తుపాకీతో కాల్పులు జరిపింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా.. సదరు మహిళను పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మద్యం తాగి హంగామా చేసిన మహిళ ను జఫ్రబాద్ కి చెందిన నుస్రత్ గా గుర్తించారు. ఇక ఈ సంఘటన ఈశాన్య ఢిల్లీలోని చౌహాన్‌ బంగ్రా ప్రాంతంలో ఈ నెల 18న చోటు చేసుకుంది. నుస్రత్‌కి, ఓ షాపు యజమానికి మధ్య మొబైల్‌ ఫోన్‌కు సంబంధించి వివాదం తలెత్తింది. అప్పటికే మద్యం సేవించి ఉన్న నుస్రత్‌ షాపు యజమానిని అసభ్యకరంగా తిడుతూ.. గన్‌తో బెదిరించడమే కాక అతని షాపు బయట కాల్పులు కూడా జరిపింది. (చదవండి: రాత్రి చితక్కొట్టి: పొద్దున అల్లుడ్ని చేసుకున్నారు)


అంతేకాక తాను గ్యాంగ్‌స్టర్‌ నసీర్‌ సోదరినని తెలిపింది. మహిళ చర్యలతో అక్కడ ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరలవ్వడంతో పోలీసులు ఆమె మీద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios